Tiger3: టైగర్3 మూవీ సెన్సార్ రివ్యూ.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన సల్మాన్ ఖాన్ కు ప్రస్తుత పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ హిట్ అవసరమనే సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ నటించిన టైగర్3 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది టైగర్3 తో సల్మాన్ కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే సెన్సార్ సభ్యులు బే**ఫ్, మ*ఫ్ అనే పదాలను మార్చాలని సూచించగా ఒక పదాన్ని మష్రూఫ్ అని మరో పదాన్ని బిజీ అని మార్చారని సమాచారం. శత్రువుల నుంచి దేశం నాశనం కాకుండా కాపాడే యోధుడిగా సల్మాన్ ఈ సినిమాలో కనిపించనున్నారు. సౌత్ లో కూడా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతుండటం గమనార్హం. టైగర్3 (Tiger3) బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించనుందని సమాచారం అందుతోంది.

రెండు గంటల 33 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. నవంబర్ 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాలి. షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ టైగర్3 సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమా ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల నుంచి యూ/ఎ సర్టిఫికెట్ వచ్చిందని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టైగర్3 సినిమాలో ఎన్టీఆర్ కనిపిస్తున్నారని జరిగిన ప్రచారంలోని నిజానిజాలు తెలియాల్సి ఉంది. సల్మాన్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus