Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Reviews » Tillu Square Review in Telugu: టిల్లు స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tillu Square Review in Telugu: టిల్లు స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 29, 2024 / 11:48 AM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Tillu Square Review in Telugu: టిల్లు స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సిద్ధు జొన్నలగడ్డ (Hero)
  • అనుపమ పరమేశ్వరన్ (Heroine)
  • మురళీధర్ గౌడ్, మురళీశర్మ, ప్రిన్స్ తదితరులు.. (Cast)
  • మల్లిక్‌ రామ్ (Director)
  • సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య (Producer)
  • రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల, అచ్చు రాజమణి (Music)
  • సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు (Cinematography)
  • Release Date : మార్చి 29. 2024
  • సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ (Banner)

2022లో విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న అతికొద్ది తెలుగు చిత్రాల్లో “డీజే టిల్లు” (DJ Tillu) ఒకటి. సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)  టైటిల్ పాత్ర పోషించడమే కాక రచయితగానూ వ్యవహరించిన ఈ చిత్రం సీక్వెల్ నేడు (మార్చి 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కావడంతోనే విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ “టిల్లు స్క్వేర్” (Tillu Square) అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) పుణ్యమా అని యూత్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది. మరి ఈ గ్లామరస్ సీక్వెల్ ఏస్థాయిలో అలరిస్తుందో చూద్దాం..!!

కథ: అప్పుడప్పుడే రాధిక ఇచ్చిన షాక్ నుండి బయటపడుతున్న టిల్లుకి (సిద్ధు జొన్నలగడ్డ) ఒక పబ్ లో పరిచయమవుతుంది లిల్లీ (అనుపమ పరమేశ్వరన్). తొలి పరిచయం తొలి ముద్దు వరకూ వెళ్లి అకస్మాత్తుగా మాయమవుతుంది లిల్లీ. కట్ చేస్తే.. తాను ప్రెగ్నెంట్ అంటూ మళ్ళీ ప్రత్యక్షమవుతుంది లిల్లీ.

ఆమెతోపాటు బడా డాన్ షేక్ మహబూబ్ (మురళీశర్మ) కూడా సినిమాలో దూరతాడు. అసలు లిల్లీ ఎవరు? టిల్లు పుట్టినరోజున లిల్లీ ఎలాంటి షాక్ ఇచ్చింది. ఈ షాకుల నుండి టిల్లు ఎలా తేరుకున్నాడు? అనేది “టిల్లు స్క్వేర్” కథాంశం.

నటీనటుల పనితీరు: కొందరు నటులు కొన్ని క్యారెక్టర్లకు పర్ఫెక్ట్ గా సింక్ అయిపోతారు. టిల్లు పాత్రకు సిద్ధు అలా సింక్ అయ్యాడు. అతడి డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ హిలేరియస్ గా వర్కవుటయ్యాయి. ఆ పాత్రలో సిద్ధు అలా లీనమైపోయాడు. టీజర్, ట్రైలర్లో కేవలం గ్లామర్ తో ఆకట్టుకున్న అనుపమ పరమేశ్వరన్..

సినిమాలో మాత్రం నటనతో అలరించింది. ముఖ్యంగా ఆమె పాత్ర చుట్టూ అల్లిన ట్విస్టులు, ఆ ట్విస్టులను అనుపమ నటనతో పండించిన తీరు బాగుంది. నటిగా ఆమెకు బాగా ప్లస్ అవుతుంది ఈ చిత్రం. మురళీశర్మ(Murali Sharma) , మురళీధర్ గౌడ్ (Muralidhar Goud) , ప్రిన్స్ ల (Praneeth Reddy Kallem) క్యారెక్టర్స్ కామెడీ బాగా వర్కవుటయ్యింది.

సాంకేతికవర్గం పనితీరు: కథ-కథనం కంటే ట్విస్టుల మీద ఎక్కువగా శ్రద్ధ చూపించి తెరకెక్కించిన చిత్రమిది. డీజే టిల్లు సెకండాఫ్ కామెడీ హిలేరియస్ గా వర్కవుటయ్యింది. అయితే టిల్లు స్క్వేర్ కి వచ్చేసరికి పుట్టినరోజి సీక్వెన్స్ తర్వాత సినిమా స్లో అయ్యింది. అందువల్ల ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కిక్ సెకండ్ పార్ట్ ఇవ్వలేకపోయిందనే చెప్పాలి.

రచయితగా సిద్ధు కొంత తడబడ్డాడు. దర్శకుడిగా మల్లిక్ రామ్ (Mallik Ram)  తన ప్రాభవాన్ని చూపలేకపోయాడు. సంగీత దర్శకులు ముగ్గురూ న్యాయం చేసారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం బాగా వర్కవుటయ్యింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, సౌండ్ మిక్సింగ్ తరహా విషయాల్లో మేకర్స్ అస్సలు రాజీపడలేదు.

విశ్లేషణ: సినిమాలో చిన్నపాటి లోపాలున్నాయి, అయితే అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టిల్లు క్యారెక్టరైజేషన్, డైలాగులు, పంచ్ లు. నేహాశెట్టి (Neha Shetty)  మరియు ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) క్యామియోలు, అనుపమ గ్లామర్ అన్నీ కలగలిసి “టిల్లు స్క్వేర్”ను హిలేరియస్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దాయి. సో, సమ్మర్ లో టైమ్ పాస్ కోసం హ్యాపీగా ఈ చిత్రాన్ని చూడొచ్చు.

ఫోకస్ పాయింట్: లిల్లీతో టిల్లుగాడి లొల్లి సూపర్ హిట్!

రేటింగ్: 3/5

Click Here to Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Malik Ram
  • #Siddhu jonnalagadda
  • #Tillu Square

Reviews

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Vana Veera Review in Telugu: వనవీర సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Psych Siddhartha Review in Telugu: సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Patang Review in Telugu: పతంగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

Siddhu Jonnalagadda: బెదిరిపోయి ‘బ్యాడాస్‌’ పక్కన పెట్టాడా? కంగుతిని ‘కోహినూర్‌’కి దూరమయ్యారా?

trending news

NBK 111: బాలయ్య సినిమా నుండి నయనతార తప్పుకోనుందా?

NBK 111: బాలయ్య సినిమా నుండి నయనతార తప్పుకోనుందా?

9 hours ago
Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

10 hours ago
Hit 3 Collections: సూపర్ హిట్ గా నిలిచిన నాని ‘హిట్ 3’..!

Hit 3 Collections: సూపర్ హిట్ గా నిలిచిన నాని ‘హిట్ 3’..!

10 hours ago
Mana ShankaraVaraPrasad Garu: బుల్లిరాజు పాత్రని ఎందుకు దాస్తున్నారు?

Mana ShankaraVaraPrasad Garu: బుల్లిరాజు పాత్రని ఎందుకు దాస్తున్నారు?

15 hours ago
Mana ShankaraVaraPrasad Garu Trailer: చిరు చిలిపి చేష్టలు.. నయన్‌ రుసరుసలు.. అనిల్‌ నవ్వులు.. సంక్రాంతి సందడి తీసుకొచ్చారుగా!

Mana ShankaraVaraPrasad Garu Trailer: చిరు చిలిపి చేష్టలు.. నయన్‌ రుసరుసలు.. అనిల్‌ నవ్వులు.. సంక్రాంతి సందడి తీసుకొచ్చారుగా!

16 hours ago

latest news

Naga Vamsi: నాగవంశీ సూపర్‌ లైనప్‌.. ఎన్ని సినిమాలకు రెడీ అవుతున్నారో తెలుసా?

Naga Vamsi: నాగవంశీ సూపర్‌ లైనప్‌.. ఎన్ని సినిమాలకు రెడీ అవుతున్నారో తెలుసా?

1 day ago
Don 3: నానా మాటలు పడ్డాక తప్పుకున్న హీరో… ఈ హీరోనైనా విడిచిపెడతారా?

Don 3: నానా మాటలు పడ్డాక తప్పుకున్న హీరో… ఈ హీరోనైనా విడిచిపెడతారా?

1 day ago
Sree Vishnu: చేతిలో రెండు సినిమాలు.. ఆ డైరక్టర్‌తో రెండో సినిమాకు రెడీ… ఇది కాకుండా మరో రెండు!

Sree Vishnu: చేతిలో రెండు సినిమాలు.. ఆ డైరక్టర్‌తో రెండో సినిమాకు రెడీ… ఇది కాకుండా మరో రెండు!

2 days ago
Naga Chaitanya – Bunny Vas: బన్ని వాస్‌తో నాగచైతన్య.. బెదరగొట్టిన డైరక్టర్‌తో కలసి…

Naga Chaitanya – Bunny Vas: బన్ని వాస్‌తో నాగచైతన్య.. బెదరగొట్టిన డైరక్టర్‌తో కలసి…

2 days ago
Dear Comrade: ‘డియర్‌ కామ్రేడ్‌’ మీద మోజు ఇంకా వదలలేదా? హీరోయిన్‌ ఫిక్స్‌!

Dear Comrade: ‘డియర్‌ కామ్రేడ్‌’ మీద మోజు ఇంకా వదలలేదా? హీరోయిన్‌ ఫిక్స్‌!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version