‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD) సినిమాకు సీక్వెల్ ఉందని.. ముందే విషయం బయటకు వచ్చినా సినిమా క్లైమాక్స్‌లో ‘యూనివర్స్’ అంటూ ఈ సినిమా ఒక భాగం కాదు, రెండు భాగాలు కాదు.. చాలా ఉన్నాయని దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) చెప్పారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే సీక్వెల్‌లో ‘కల్కి’ ఉండదు అని చెబుతున్నారు. అలాగే తొలి సినిమా ఫైనల్ ట్విస్ట్ టైటిల్ అవ్వబోతోంది అంటున్నారు. ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు ఇచ్చాయి.
అయితే ఈ సినిమా సీక్వెల్ ఇప్పుడిప్పుడే మొదలవ్వదు అని వార్తలొస్తున్నాయి చెప్పిన టీమ్.. స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టింది అని తెలుస్తోంది. ఈ క్రమంలో సినిమా పేరు విషయంలో ఓ నిర్ణయం వచ్చింది అని అంటున్నారు. అదే ‘కర్ణ 3102 బీసీ’ అని అంటున్నారు. ఈ సినిమాలో కర్ణుడు ప్రభాస్ (Prabhas) , అశ్వద్ధామ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మధ్య నడిచే కథను చూపించబోతున్నారట. అలాగే మధ్యలో విలన్ యాస్కిన్ మరింత పవర్ ఫుల్‌గా ఉంటుంది అని చెబుతున్నారు.
ఆ లెక్కన సినిమా బ్యాక్ డ్రాప్ ఏడీ నుంచి బీసీకి వెళ్తుంది అని చెప్పొచ్చు. అంటే భవిష్యత్తు నుండి గతంలోకి సినిమా వెళ్తుంది అన్న మాట. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది అంటున్నారు. ఇక సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి చేసి సినిమాను 2028లో విడుదల చేసేలా ప్లానింగ్ చేస్తున్నారు అంటున్నారు. అయితే ఈ విషయంలో పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది అంటున్నారు.
ఎందుకంటే ప్రభాస్ ఇప్పటికిప్పుడు ‘కల్కి’ సీక్వెల్‌కి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం ‘రాజాసాబ్’ (The Rajasaab) సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ తర్వాత హను రాఘవపూడి (Hanu Raghavapudi) సినిమా చేస్తాడు. ఆ తర్వాత ‘సలార్ 2’ (Salaar) చేస్తాడు అంటున్నారు. కాబట్టి ‘కల్కి’ సీక్వెల్‌కి చాలా టైమ్ పడుతుంది.