Balakrishna, Gopichand Malineni: బాలయ్య సినిమాకు టైటిల్ ఫిక్స్ అయినట్లేనా?

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఈ సినిమాకు రౌడీయిజం అనే టైటిల్ వినిపించగా మేకర్స్ స్పందించి టైటిల్ ఫిక్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాతలు జై బాలయ్య అనే టైటిల్ ను రిజిష్టర్ చేయించారని సమాచారం. బాలయ్య ఫ్యాన్స్ మెచ్చే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ కావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని చాలా టైటిళ్లను పరిశీలించి చివరకు ఈ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ కంటే క్యాచీ టైటిల్ దొరికితే మాత్రం టైటిల్ విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. క్రాక్ సక్సెస్ తో జోరుమీదున్న గోపీచంద్ మలినేని బాలయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాలని భావిస్తున్నారు. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

అనంతపురం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య అభిమానులకు నచ్చే సన్నివేశాలు ఉండే విధంగా గోపీచంద్ మలినేని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్లకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus