Anushka, Krish: ఆ టైటిల్ వద్దంటున్న అనుష్క అభిమానులు.. ఏమైందంటే..!

అనుష్క ఇప్పుడు సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది. 2020 లో వచ్చిన ‘నిశ్శబ్దం’ తర్వాత.. చాలా గ్యాప్ తీసుకుని ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చేసింది. గతేడాది అంటే 2023 లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత అనుష్క మళ్ళీ వెంటనే సినిమాలు చేయడానికి అంగీకరించింది లేదు. ఇటీవల క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సైన్ చేసింది. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.

కానీ క్రిష్- అనుష్క..లు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి.. ఈ ప్రాజెక్టు ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి. ఇది అనుష్క కెరీర్లో 50 వ సినిమా. తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని సెట్స్ వేసినట్టు వినికిడి. అలాగే ఈ చిత్రానికి ‘శీలావతి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ టైటిల్ కూడా చర్చనీయాంశం అయ్యింది. అనుష్క (Anushka) వంటి స్టార్ హీరోయిన్ సినిమాకి ఇలాంటి టైటిల్ ఏంటి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ టైటిల్ వద్దు అని కూడా అనుష్క అభిమానులు కోరుతున్నారు. అయితే ఈ టైటిల్ ను చిత్ర బృందం అనుకున్న మాట నిజమే..! ముందుగా వర్కింగ్ టైటిల్ గా అనుకుంటున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు కాబట్టి.. ఈ టైటిల్ మార్చే అవకాశాలు ఉన్నాయట. ఇక ఈ ప్రాజెక్టుని ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ వారితో కలిసి ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ వారు నిర్మించనున్నారు.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus