చిరంజీవి కొత్త సినిమాకు ఊరమాస్ టైటిల్..?

సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ హీరోలు చేసే సినిమాల సంఖ్యను తగ్గించుకుంటారు. కానీ చిరంజీవి మాత్రం మిగతా హీరోలకు భిన్నంగా వేగంగా సినిమాలు చేస్తున్నారు. శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత రాజకీయాల్లో బిజీ కావడం వల్ల పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి రీఎంట్రీలో మాత్రం గ్యాప్ రాకుండా వరుసగా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం. చిరంజీవి ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఆచార్య సినిమా ఆయనకు 152వ సినిమా కాగా సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా తర్వాత మోహన్ రాజా డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్ లో నటించబోతున్న చిరంజీవి ఈ సినిమాతో పాటు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ఈ సినిమాకు వీరయ్య అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే చిరంజీవి బాబీ సినిమాకు ఈ టైటిల్ నే ఫిక్స్ చేశారో లేక మరో టైటిల్ ను ఫిక్స్ చేశారో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేస్తారో తెలియాల్సి ఉంది. జై లవకుశ, వెంకీ మామ సినిమాల తర్వాత బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. టైటిల్ ఫిక్స్ అయినట్టు జరుగుతున్న ప్రచారం గురించి మెగా హీరోలు లేదా చిరు బాబీ మూవీ నిర్మాతల నుంచి స్పష్టత వస్తుందేమో చూడాల్సి ఉంది.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus