టైటిల్స్ ఇచ్చి పుచ్చుకున్న హీరోలు

చిత్ర రంగంలో అనేక విచిత్రాలు జరుగుతుంటాయి. ఒకరికోసం రాసిన కథలో మరొకరు నటిస్తుంటారు. చివరి వరకు అనుకున్న హీరోయిన్ ప్లేస్ ని మరొక బ్యూటీ భర్తీ చేస్తుంది. ఇలా ఒక హీరో కోసం రిజిస్టర్ చేసిన టైటిల్ మరో హీరో తీసుకుంటారు. ఎంతో గ్రాండ్ గా మొదలైన సినిమా మధ్యలో ఆగిపోతే.. ఆ మూవీ టైటిల్ తో మరో స్టోరీ తెరకెక్కుతుంది. ఇలా టైటిల్ మార్చుకున్న సినిమాలపై ఫోకస్…

చరణ్ – ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సినిమాకు మొదట కంత్రి అని పేరు పెట్టాలనుకున్నారు. మెగా ఫ్యామిలికి ఆ టైటిల్ అంతగా నచ్చకపోవడంతో చిరుత అని పేరు పెట్టారు. చివరికి కంత్రి ఎన్టీఆర్ సినిమా టైటిల్ అయింది.

వెంకటేష్ – శర్వానంద్మారుతి డైరక్షన్లో వెంకటేష్ హీరోగా ‘రాధ’ అనే సినిమా మొదలయింది. అయితే కథ విషయంలో పేచీ రావడంతో ఆగిపోయింది. ఆ టైటిల్ శర్వానంద్ కి ఫిక్స్ అయింది.

కలర్స్ స్వాతి – అంజలిఅంజలి ప్రధాన పాత్రలో ‘గీతాంజలి’ వచ్చింది. సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి ముందు అనుకున్న టైటిల్ ‘త్రిపుర’. పీవీపీ వాళ్లు నిర్మించాల్సింది. కానీ కోన వెంకట్ నిర్మించడంతో ఆ పేరును ‘గీతాంజలి’ గా మార్చారు. కలర్స్ స్వాతి సినిమాకి త్రిపుర అనే పేరును వాడుకున్నారు.

పవన్ కళ్యాణ్ – సప్తగిరి హీరో పవన్ కల్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా నటించిన సినిమా ‘కాటమరాయుడు’ టైటిల్ ని హాస్య నటుడు సప్తగిరి తన సినిమా కోసం రిజిస్టర్ చేయించారు. కానీ ఆ టైటిల్ ని పవన్ కోరడంతో సప్తగిరి సంతోషంగా ఇచ్చేశాడు.

మహేష్ – ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ టైటిల్ ని మహేష్ బాబు కోసం నిర్మాతలు రిజిస్టర్ చేయించారు. చివరికి అది ప్రభాస్ సినిమా టైటిల్ గా మారింది.

ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాకు ‘ఎమ్ ఎల్ ఏ.. మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనే పేరును అనుకున్నారు. కానీ చివరికి ‘రామయ్యా వస్తావయ్యా’ పెట్టారు. అప్పుడు వదిలేసినా పేరుని ఇప్పుడు కల్యాణ్ రామ్ సినిమాకు వాడుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus