పేరు, ప్రఖ్యాతలతో పాటు మంచి సంపాదన అందించే రంగం సినిమా రంగం. ఇక్కడ హిట్ వచ్చే వరకు ఒక లెక్క.. వచ్చిన తర్వాత మరో లెక్క ఉంటుంది. ప్రధానంగా హీరోలకు అయితే కోట్లలోనే రెన్యుమరేషన్స్ ఉంటాయి. బడ్జెట్ తో సమానంగా పారితోషికం అందుకునే వారు లేకపోలేదు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రెమ్యునరేషన్ అందుకోకుండా సినిమా చేయడం, ఆ మూవీ అందుకున్న లాభాల్లో వాటా అందుకోవడం ఫ్యాషన్ అయిపోతోంది. అటువంటి స్టార్ హీరోలపై ఫోకస్..
మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమాకు 20 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అయినా శ్రీమంతుడు సినిమా మేకింగ్ సమయంలో ఒక రూపాయి కూడా అందుకోలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 145 కోట్లు కలక్షన్ రాబట్టింది. నిర్మాణ ఖర్చులు పోను లాభాల్లో మహేష్ వాటా అందుకున్నారు.
ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి బిగినింగ్ కోసం రెండేళ్లు కష్టపడ్డారు. అందుకోసం పారితోషికంగా 25 కోట్లు ఇవ్వాలని నిర్మాతలు ముందు అనుకున్నారు. కానీ ఆ చిత్రం 600 కోట్లు వసూలు చేయడంతో మరో నలభై కలిపి 65 కోట్లు ఇచ్చారు. బాహుబలి కంక్లూజన్ కి కూడా రెమ్యునరేషన్ పరంగా కాకుండా లాభాల్లో వాటాల రూపంలోనే అందుకున్నారు.
రామ్ చరణ్ వరుస అపజయాలతో సతమవుతున్న రామ్ చరణ్ కి ధృవ మంచి హిట్ ని అందించింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకి ముందు చరణ్ రెమ్యునరేషన్ తీసుకోలేదు. లాభాల్లో వాటా రూపంలో 17 కోట్లు అందుకున్నారు.
పవన్ కళ్యాణ్పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రెమ్యునరేషన్ అనే మాటను పక్కన పెడుతున్నారు. లాభాల్లో షేర్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోలేదు. టేబుల్ ప్రాఫిట్ లో తన షేర్ గా 30 కోట్లు తీసుకున్నారు.
వెంకటేష్ విక్టరీ వెంకటేష్ తొలిసారి “బాబు బంగారం” సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేశారు. ఆ సినిమా కలెక్ట్ చేసిన మొత్తంలో షేర్ అందుకున్నారు. లేటెస్ట్ గా వచ్చిన గురు మూవీకి కూడా వెంకీ లాభాల్లో వాటినే తీసుకున్నారు.
నాగచైతన్య యువ సామ్రాట్ నాగ చైతన్య హిట్ చిత్రాల్లో 100 % లవ్ ఒకటి. అల్లు అరవింద్ ఈ సినిమాకి చైతూకి రెమ్యునరేషన్ ఇవ్వలేదు. ఆ సినిమా సాటిలైట్ రైట్స్ మొత్తాన్ని అతనికి ఇచ్చేసారు. మా టీవీ వారు ఈ మూవీని అధిక ధరకు కొనుగోలు చేశారు. ఆ మొత్తం నాగచైతన్య జేబులోకి వెళ్లింది.
నాగార్జున కింగ్ నాగార్జున సొంత బ్యానర్లో మనం, సోగ్గాడే చిన్ని నాయన వంటి సినిమాలు చేశారు. ఇవి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వీటికి ఇక ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? అని మనం అడగలేమి.. ఆయన చెప్పనూలేరు.
చిరంజీవి చిరంజీవి రీ ఎంట్రీకి ముందు సొంత బ్యానర్లు అయినప్పటికీ అంజనా ప్రొడక్షన్స్, గీత ఆర్ట్స్ బ్యానర్లో సినిమాలు చేస్తే పక్కగా రెమ్యునరేషన్ తీసుకునేవారు. కానీ తొలిసారి పారితోషికం తీసుకోకుండా ఖైదీ నంబర్ 150 మూవీ చేశారు. రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించిన ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో లాభాల్లో వాటాగా 30 కోట్లు చిరు అందుకున్నాడు.
ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో జై లవ కుశ సినిమా చేస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి తారక్ రెమ్యునరేషన్ అందుకోవడంలేదు. అన్నకి సినిమాకి ఖర్చుచేసిన మొత్తం తిరిగి వచ్చేసిన తర్వాత ఎంత లాభం మిగులుతుందో అందులో ఎంత ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.