తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 నేడు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తరలివచ్చే పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా ఇప్పటికే పోలింగ్ బూతుల వద్దకు చేరుకొని సాధారణ ప్రజల మాదిరిగా లైన్ లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో పాటు సమీప పోలింగ్ బూత్ జూబ్లీ హిల్స్ పోలింగ్ బూత్ వద్ద తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్ వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 6:30 నిమిషాలకు అల్లు అర్జున్ పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు అయితే అప్పటికి ఈవీఎం కాస్త మొరయించడంతో దాదాపు గంటకు పైగా ఈయన క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి స్కూల్లో జూనియర్ ఎన్టీఆర్ తన భార్య తల్లితో కలిసి క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
విక్టరీ వెంకటేష్ సైతం మణికొండలో పోలింగ్ బూత్ వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇలా స్టార్ హీరోలు అందరూ కూడా తమ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నప్పటికీ సినిమా షూటింగ్ వాయిదా వేసుకుని మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఇక రామ్ చరణ్ స్పెషల్ ఫ్లైట్లో మైసూర్ నుంచి హైదరాబాద్ చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక (Telangana Assembly Polls) ఎన్నికల కౌంటింగ్ డిసెంబర్ మూడో తేదీ జరగనున్నది.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!