వైరల్ అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ రేర్ పిక్.

సోషల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ తర్వాత అంతలా వైరల్ అయ్యేది సినిమా వార్తలే. ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి.. అప్‌డేట్స్ దగ్గరినుండి ప్రతి చిన్న విషయాలు కూడా బాగా ట్రెండ్ అవుతుంటాయి. ఇక సెలబ్రిటీల గురించిన టాపిక్స్ అయితే చెప్పక్కర్లేదు. అందులోనూ హీరోయిన్ల ఫొటోషూట్స్, రేర్ పిక్స్, వాళ్లు చేసే పోస్టుల వంటివి వద్దన్నా వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఓ క్రేజీ హీరోయిన్, హైదరాబాదీ బ్యూటీ షేర్ చేసిన రేర్ పిక్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది..

‘చిట్టీ నీ నవ్వంటే లక్ష్మీ పటాసే’ అని పాడుకుంటూ హీరో తనవెనకే తిరుగుతూ పిచ్చోడైపోయేలా చేయడమే కాక.. కుర్రకారుకి ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది సొట్టబుగ్గల సుందరి ఫరియా అబ్దుల్లా. ఫస్ట్ మూవీ ‘జాతిరత్నాలు’ లో తన అందం, అభినయంతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. కింగ్ నాగార్జున, నాగా చైతన్యల ‘బంగార్రాజు’లో స్పెషల్ సాంగ్‌తో రచ్చ లేపింది.. ‘జాతిరత్నాలు’ లో చూసిన చిట్టీనేనా మనం చూస్తుంది? అని ప్రేక్షకులు షాక్ అయ్యేలా చేసింది.

అంటే ఆ రేంజ్‌లో అందాలు ఆరబోసిందన్నమాట. తన అందం, అమాయకత్వంతో అలరించిన ఫరియా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్, రీల్స్ షేర్ చేస్తుంటుంది. బేసిగ్గా ఫరియా మంచి డ్యాన్సర్. తన రీల్స్‌ బాగా వైరల్ అవుతుంటాయి.

ఇప్పుడు తన చిన్ననాటి ఫొటో పోస్ట్ చేసింది ఫరియా.. స్కూల్ యూనిఫాంలో ఫ్రెండ్స్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న పిక్ ఆకట్టుకుంటుంది.. ‘చిన్నప్పుడు భలే ఉన్నావ్ చిట్టీ’.. ‘వందమందిలో ఉన్నా నీ ఫేస్, స్మైల్ చూసి గుర్తుపట్టెయ్యొచ్చు’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus