ఒడ్డు పొడుగు అందం కలిగిన సమీరా తెలుగు ఫ్యామిలీకి చెందిన ముంబై హీరోయిన్. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన ‘నరసింహుడు’ సినిమా తో ఆమె టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. 2005లో నరసింహుడు విడుదల కాగా అదే ఏడాది చిరంజీవి హీరోగా విజయ భాస్కర్ తెరకెక్కించిన రివేంజ్ డ్రామా ‘జై చిరంజీవ’ లో నటించింది. ఎన్టీఆర్ తో ఆమె చేసిన మొదటి చిత్రం నరసింహ అట్టర్ ప్లాప్. అయినప్పటికీ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘అశోక్’ చిత్రం కోసం సమీరా రెడ్డిని తీసుకోవడం జరిగింది.
ఈ మూవీ సమయంలో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందని గట్టిగా పుకార్లు వినిపించాయి. ఎన్టీఆర్, సమీరా ఇద్దరు ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ పుకార్లలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కాని ఆ సినిమా తరువాత సమీరా మళ్ళీ టాలీవుడ్ లో అడుగుపెట్టలేదు. ఆ పుకార్లు తనను, ఫ్యామిలీని ఎంతగా బాధించాయో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సమీరా రెడ్డి. ఈ విషయం గురించి మాట్లాడుతూ …అందరితో కలిసిపోయే స్వభావం కలిగిన నేను, ఎన్టీఆర్‌తో కూడా చాలా చనువుగా ఉండేదానిని. దానితో మేమిద్దరం రిలేషన్‌లో ఉన్నామని పుకార్లు వచ్చాయి. ఫ్యాన్స్ నా పేరును సమీరా రెడ్డి నుంచి సమీరా ఎన్టీఆర్‌గా మార్చేశారు. సమీరా అంటే ఎన్టీఆర్ హీరోయిన్ అన్నట్లుగా ప్రచారం చేశారు.
నేను మంచి నటిని అలాగే డ్యాన్సర్ ని ,ఎంత టాలెంట్ ఉండి కేవలం ఎన్టీఆర్ హీరోయిన్ అనిపించుకోవడం నాకు నచ్చలేదు. ఎన్టీఆర్ తో ఎఫైర్ రూమర్లు నన్ను ఇబ్బంది పెట్టాయి. నాకు తెలిసి ఎన్టీఆర్‌ను కూడా ఈ పుకార్లు బాధపెట్టి ఉండొచ్చు అని సమీరా తెలిపింది. 2014లో సమీరా అక్షయ్ వర్దే అనే పారిశ్రామిక వేత్తను వివాహమాడింది. వివాహం అనంతరం ఈమె సినిమా పరిశ్రమ వైపు చూడలేదు. హీరో సుదీప్ తో చేసిన కన్నడ చిత్రం వరదనాయక ఆమె చివరి చిత్రం. ఆమెకు మొదటి సంతానంగా ఓ కొడుకు పుట్టాడు. గత ఏడాది జులై లో మరో పాపకు జన్మనిచ్చింది.