బిగ్‌బాస్‌లోకి మరుగున పడిన డైరెక్టర్

  • September 5, 2020 / 10:13 PM IST

‘బిగ్‌బాస్’ కొన్ని గంటల్లో స్టార్ట్ కానుంది. హౌస్‌లోకి ఎవరు వెళతారని టీవీ వీక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ‘ఫిల్మీ ఫోకస్’కి అందిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం ప్రకారం ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళుతున్న కంటెస్టెంట్లలో దర్శకుడు సూర్యకిరణ్ ఒకరు. ఆయన మరుగునపడి చాలా సంవత్సరాలు అయ్యింది. సుమారు 17 ఏళ్ళు క్రితం సుమంత్ హీరోగా తీసిన ‘సత్యం’ ఒక్కటే సూర్య కిరణ్ కెరీర్‌లో హిట్ సినిమా. తరవాత మూడు నాలుగు సినిమాలు తీశారు గానీ హిట్లు కొట్టలేదు.

దర్శకుడిగా సూర్య కిరణ్ కెరీర్ విజయవంతంగా సాగలేదు. వ్యక్తిగత జీవితమూ ఆశించిన రీతిలో సాగలేదు. రవితేజ సరసన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా సహా తెలుగులో మరికొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన కళ్యాణి అలియాస్ కావేరిని సూర్య కిరణ్ పెళ్లి చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం ఇద్దరూ వేరు పడ్డారు. విడాకులు తీసుకోలేదు కానీ వేర్వేరుగా జీవిస్తున్నారు. ఇప్పుడు సూర్యకిరణ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన తరవాత ఈ విషయాలు చర్చకు రావడం, గొడవలు జరగడం వంటివి ఉంటాయని ఊహించవచ్చు.

సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానల్‌లో తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ 4 స్టార్ట్ కానుంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. కంటెస్టెంట్లు ఒక్కొక్కరిని ఆయన వీక్షకులకు ఇంట్రడ్యూస్ చేయనున్నారు. సుమారు వంద రోజులు రియాలిటీ షో వీక్షకులను ఎంటర్టైన్ చేయనుంది.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus