మరదళ్లు, మేనమామ కుమార్తెలను పెళ్లి చేసుకున్న టాలీవుడ్, కోలీవుడ్ హీరోలు ఎవరంటే..!

‘కళ్యాణం.. కమనీయం’.. ఇలా వెండితెర మీద హీరో హీరోయిన్లు పాట పాడుకుంటుంటే.. సినిమా చూస్తున్న ఆలుమగలు సిగ్గుతో ఒకరినొకరు చూసుకుంటూ తమ వివాహ సందర్భాన్ని తల్చుకునేవారు.. ఇక స్టార్ల విషయానికొస్తే.. ఆన్ స్క్రీన్ రొమాన్స్, లవ్, మ్యారేజెస్, ఫస్ట్ నైట్ లాంటి సీన్లు తప్పవు.. అలా ఇష్టపడి రీల్ లైఫ్ పార్ట్‌నర్‌ని రియల్ లైఫ్‌లోకి తెచ్చుకున్నవారు ఉన్నారు.. అయితే కెరీర్ స్టార్ట్ చెయ్యకముందు.. స్టార్ట్ చేసిన తర్వాత కూడా.. బుద్దిగా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే చేసుకున్నారు కొంతమంది కథానాయకులు.. సీనియర్ ఎన్టీఆర్ నుండి సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ వరకు ఎంతమంది తమ మరదళ్లను, మేనమామ కుమార్తెలను వివాహమాడారో చూద్దాం..

1. ఎన్టీఆర్ – బసవ రామతారకం : (మేనమామ కుమార్తె)..

నందమూరి తారక రామారావు కాలేజీలో చదువుతూ.. నాటకాలు వేస్తుండగా.. 1942లో.. అంటే ఆయన 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె బసవ రామతారకంను పెళ్లి చేసుకున్నారు.. వీరికి నలుగురు కుమార్తెలు, ఏడుగురు కుమారులు సంతానం..

2. కృష్ణ – ఇందిరా దేవి : (మేనమామ కుమార్తె)..

ఘట్టమనేని శివ రామ కృష్ణ సినిమాల్లోకి రాకముందే మేనమామ కుమార్తె ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు.. వీరికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు సంతానం..

3. మోహన్ బాబు – నిర్మలా దేవి : (మరదలు)..

మంచు భక్తవత్సలం నాయుడు అలియాస్ మోహన్ బాబు తన మరదలు నిర్మలా దేవిని చేసుకున్నారు.. వీరికి ఇద్దరు కుమారులు.. ఓ కుమార్తె ఉన్నారు..

4. ఆది సాయి కుమార్ – అరుణ : (మరదలు)..

తాత, తండ్రి తర్వాత నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆది.. మరదలు అరుణను మ్యారేజ్ చేసుకున్నారు.. ఈ జంటకి ఓ పాప ఉంది..

5. కార్తి – రజినీ..

తండ్రి శివ కుమార్, అన్నయ్య సూర్యలానే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తి.. తన మరదలు రజినీని వివాహం చేసుకున్నారు.. వీరికి ఓ పాప ఉంది..

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus