ఈ ఏడాది వీళ్లకి మాత్రం చాలా స్పెషల్!

2020 కరోనా వైరస్ కారణంగా ప్రపంచానికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. కానీ కొందరికి మాత్రం ఈ ఏడాది మంచి అనుభూతులను మిగిల్చింది. ముఖ్యంగా కొందరు పెళ్లిపీటలు ఎక్కారు. అందులో విచిత్రం లేదు కానీ కొందరు మాత్రం ఈ ఏడాది రెండో పెళ్లి చేసుకున్నారు. చాలా మంది సెలబ్రిటీలు 2020లో రెండోసారి పెళ్లిపీటలు ఎక్కడం ఆసక్తికరంగా మారింది.

తాజాగా సింగర్ సునీత కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. కొన్ని రోజులుగా ఈమె పెళ్లిపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ తనకు కాబోయే భర్త తో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అతడితో ఎంగేజ్మెంట్ కూడా జరగడంతో సునీత రెండో పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే పెళ్లి డేట్ పై అధికార ప్రకటన రానుంది. సునీతకు19 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త వేధింపులు భరించలేక ఆమె విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం పిల్లల బాధ్యతను ఆమే చూసుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి కొత్త జీవితం మొదలుపెట్టబోతోంది.

ఇక సునీత కంటే ముందు 2020లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నాడు. యాభై ఏళ్ల వయసులో ఈయన మరో పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. దిల్ రాజు మొదటి భార్య 2017 సంవత్సరంలో అనారోగ్యం కారణంగా మరణించింది. ఆమె మరణంతో గత మూడేళ్ళుగా దిల్ రాజు ఒంటరి జీవితం గడుపుతున్నారు. దీంతో దిల్ రాజు కూతురు దగ్గరుండి తన తండ్రికి రెండో పెళ్లి చేసింది. తేజస్విని అనే బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిని దిల్ రాజు పెళ్లాడారు.

ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 2 ఫేమ్ సామ్రాట్ కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. గతంలో హర్షిత అనే యువతిని సామ్రాట్ పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లకే వారి మధ్య కలహాలు మొదలు కావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కాకినాడకి చెందిన అమ్మాయి శ్రీలిఖితను రెండో పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.

ఇక ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా కూడా సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. బీహార్ కి చెందిన ఓ లేడీ డాక్టర్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని.. దీంతో ఆమెని పెళ్లి చేసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus