Nagarjuna: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీతో నాగార్జున సినిమా ఫిక్స్?

కొత్త దర్శకులను పరిచయం చేయడంలో నాగార్జున ఎప్పుడూ ముందుంటారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన పరిచయం చేసిన దర్శకులు ఎంతో మంది స్టార్ డైరెక్టర్లుగా ఎదిగారు. రాంగోపాల్ వర్మ, లారెన్స్, కళ్యాణ్ కృష్ణ .. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ రైటర్ గా పేరొందిన ప్రసన్న కుమార్ బెజవాడ ను కూడా దర్శకుడిగా పరిచయం చేయాలని భావించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.

ఈ ఏడాది సంక్రాంతి కే అనౌన్స్మెంట్ రావాలి. కానీ రాలేదు.ఆ సినిమా కోసం నాగ్ లుక్ కూడా మార్చుకున్నారు. అయినా ‘ఎందుకు ఈ ప్రాజెక్టు ప్రారంభం కాలేదు అనేది అంతుచిక్కని ప్రశ్న’ అని చాలా మంది భావిస్తున్నారు. ప్రసన్న కుమార్ ఈ ప్రాజెక్టు గురించి స్పందించారు. ఈ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ అయిపోతుండటం వల్ల .. ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు అని ఆయన చెప్పారు. అంతేకాదు పేపర్ మీదే రూ.65 కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది అని డిసైడ్ అయ్యారట.

నాగార్జున సినిమాలు ఈ మధ్య కాలంలో భారీ వసూళ్లు సాధించిన సినిమాలు చాలా తక్కువ. ‘బంగార్రాజు’ హిట్ అయినా .. భారీ లాభాలు అయితే తెచ్చిపెట్టలేదు. ఇక ‘ఘోస్ట్’ ఓపెనింగ్స్ గురించి అందరికీ తెలిసిన సంగతే..! అయితే నాగార్జున పుట్టినరోజు నాడు అయిన ఆగస్టు 29న కొత్త సినిమా వివరాలు బయటకు వస్తాయి అని అభిమానులు భావిస్తున్నారు. ప్రసన్న కుమార్ ప్రాజెక్టు పైనే వారి దృష్టి ఉంది. అయితే ప్రసన్నని పక్కన పెట్టి నాగార్జున..

కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేయాలని భావిస్తున్నాడట. ఆల్రెడీ ఆ ప్రాజెక్టు కి ‘నా సామి రంగ’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు ఇన్సైడ్ టాక్.విజయ్ బిన్నీ ‘ఛలో’ ‘నేను లోకల్’ వంటి హిట్ సినిమాలకి కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు. మరి అతను (Nagarjuna) నాగ్ తో చేయబోతున్న సినిమాపై క్లారిటీ రావాలంటే ఆగస్టు 29 వరకు వెయిట్ చేయాల్సిందే.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus