కథ నచ్చితే చాలు.. ఇంకేమి మార్పులు చెప్పకుండా ఆ స్టోరీ లోని హీరోగా ప్రభాస్ తనను తాను మార్చుకుంటారు. ఆయన తొలి చిత్రం ఈశ్వర్ నుంచి బాహుబలి దాకా ఇదే రూట్ లో వెళుతున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రభాస్ డెడికేషన్, హార్డ్ వర్క్ ని గుర్తిస్తోంది, కీర్తిస్తోంది. కానీ టాలీవుడ్ ఎప్పుడో ప్రభాస్ ని డార్లింగ్ గా స్వీకరించింది. ప్రభాస్ కి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ ఫోకస్ పై ఫోకస్ పెట్టండి…
లుక్ కోసం శ్రమించడంపాత్రలోకి ఇమిడిపోవడానికి ప్రభాస్ తన బాడీని మార్చుకుంటుంటారు. అది చిన్న సినిమా? పెద్ద సినిమా? అని ఆలోచించరు. ఎంత కష్టానికైనా వెనుకాడరు. బాహుబలి కోసం సిక్స్ ప్యాక్ రప్పించారు. అంతకంటే ముందు వచ్చిన ఛత్రపతి, మున్నా, రెబల్ మూవీలలోను అతని బాడీ సూపర్ ఫిట్ గా ఉంటుంది.
డైరక్టర్స్ మాటే శాసనంసినిమాని ఒప్పుకున్నాక ఆ డైరక్టర్ కి చివరి వరకు ప్రభాస్ కట్టుబడి ఉంటారు. దర్శకుడు ఏది చెప్పితే అది చేస్తారు. ఎప్పుడూ ఎదురు మాట్లాడరు. ఈ గుణం వల్ల దర్శకులకు అభిమాన హీరో అయ్యారు.
అభిమానుల హీరోతన అభిమానులను ప్రభాస్ సొంత వ్యక్తుల్లా భావిస్తారు. ఎంత బిజీగా ఉన్నా తనకోసం వచ్చిన వారితో కాసేపు టైమ్ స్పెండ్ చేస్తారు. అందుకే అతని ఫ్యాన్స్ అందరూ డార్లింగ్ అని పిలుచుకుంటారు.
హీరోలకు బెస్ట్ ఫ్రెండ్తెలుగు చిత్ర పరిశ్రమలోని తన వయసు హీరోలందరితో ప్రభాస్ స్నేహంగా ఉంటారు. వారితో కలిసినప్పుడు సినిమాల గురించి వదిలేసి జోకులతో సందడి చేస్తుంటారు.
సాయం అయన నైజంపిల్లలు, వృద్ధుల ఆశ్రమాలకు మూడో కంటికి తెలియకుండా ప్రభాస్ సాయం చేస్తుంటారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా బాధితులను ఆదుకోవడంలో ముందుంటారు.
ఛాలెంజింగ్ రోల్స్కేవలం కమర్షియల్ కథలనే ఎంచుకోకుండా సినిమాకి సినిమాకి విభిన్నంగా ఉండాలని ఛాలెంజింగ్ రోల్స్ చేస్తుంటారు. ఛత్రపతి, చక్రం, పౌర్ణమి, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, మిర్చి, బాహుబలి.. ఇలా అతని సినిమాలో పోషించిన రోల్స్ వేటికవే ప్రత్యేకం.
ఇలా రీల్, రియల్ లైఫ్ లో గొప్ప గుణాలతో తెలుగు ప్రజలందరికీ ప్రభాస్ డార్లింగ్ అయ్యారు.