కన్సల్టెన్సీలు, ఫేక్ సర్టిఫికెట్లు.. వంటి వాటి గురించి మనం నిత్యం వింటూనే ఉంటాం. అయితే సినీ పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తూ భారీగా డబ్బులు వెనకేస్తున్నాడు అనే సంగతి మాత్రం ఎక్కువమంది వినుండరు. వివరాల్లోకి వెళితే.. శివాజీ హీరోగా ప్రీతీ విజయ్ కుమార్ హీరోయిన్ గా ‘వైఫ్’ అనే చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి రావిపల్లి రాంభద్రరావు అలియాస్ రాంబాబు దర్శకుడు. 2001 లో రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.
ఫ్యామిలీ మూవీ అంటూ బీ గ్రేడ్ టచ్ ఉన్న మూవీ తీసి విమర్శల పాలయ్యాడు రాంబాబు. ఆ తర్వాత ఇతనికి అవకాశాలు లభించలేదు. అసలు ఇతను ఏమైపోయాడో కూడా జనాలు పట్టించుకోలేదు. అయితే తాజాగా ఇతను నకిలీ సెర్టిఫికెట్ల కేసులో పట్టుబడటం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు వాసి తాడిశెట్టి రేణుకేశ్(48)కు శ్రీవెంకటేశ్వర కన్సల్టెన్సీ ఉంది. పక్క రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాల ఫేక్ సెర్టిఫికెట్లు విక్రయించే హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన రాహుల్ దీక్షిత్‌తో పరిచయం కూడా ఉంది.
(Director) రావిపల్లి రాంబాబు, అతని బంధువు, హైదరాబాద్ ఎర్రగడ్డలో అప్‌గ్రేడ్ స్టడీ కన్సల్టెన్సీ నిర్వాహకుడు అన్నం దినేశ్(37), యూసుఫ్‌గూడకు చెందిన గొల్లపల్లి శ్రవణ్ (29) తదితరులతో పరిచయం చేసుకున్నాడు రేణుకేశ్. వీళ్ళు. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు ధ్రువీకరణ పత్రాలను రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు విక్రయిస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కోంపల్లికి చెందిన గొట్టిముక్కల రోహిత్ వర్మకు ఇటీవల బీటెక్ సెర్టిఫికెట్ ను విక్రయిస్తే..
ఈ విషయం పోలీసులు చెవిన పడటంతో రోహిత్ వర్మ, రేణుకేశ్, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. 39 ఫేక్ సర్టిఫికెట్ లు, 486 హోలోగ్రామ్‌లు, కారు, 8 ఫోన్లు, రబ్బరు స్టాంపులు వారు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. డైరెక్టర్ రాంబాబు, దినేశ్, రాహుల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం. ఇదంతా చూస్తుంటే ఎవ్వరికైనా నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా గుర్తుకురావడం ఖాయం.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా