సూపర్ హిట్ డైరెక్టర్.. హీరోగా మారబోతున్నాడు

కొంతమంది హీరోలు.. సక్సెస్ కాకపోతే సెకండ్ హీరోగానో, విలన్ గానో, ఆఖరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో అయినా సెటిల్ అయిపోతుంటారు. ఇది ఇప్పటి వరకూ మనం చూసింది హీరోల వెర్షన్. ఇక డైరెక్టర్లు తమ సినిమాలు సక్సెస్ కాకపోతే కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో, విలన్ గానో సెటిల్ అయిపోతుంటారు. ఎస్.జె.సూర్య, సముద్రఖని వంటి వంటి వారిని ఈ లిస్ట్ లో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన ఓ మాస్ డైరెక్టర్ వరుస ప్లాపులు రావడంతో ఏకంగా హీరో మారిపోతున్నాడు. ఇంతకీ ఎవరు ఆ డైరెక్టర్ అనేగా మీ డౌట్.

ఆ మాస్ డైరెక్టర్ మరెవరో కాదు.. మన వీవీ వినాయక్. అవును వినాయక్ త్వరలో హీరో కాబోతున్నాడు. అయన అభిమానులకు ఈ వార్త ఓ సర్ ప్రయిజ్ అనే చెప్పొచ్చు. గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఠాగూర్’ ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంలో ప్రత్యేక పాత్రలను పోషించాడు. ఇప్పుడు ఏకంగా సోలో హీరోగా పరిచయం కాబోతున్నాడు…ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తుండటం విశేషం. ‘శరభ’ ఫేమ్, గతంలో శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్‌ నరసింహారావు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది సమాచారం. అయితే ఈ చిత్రంలో హీరోగా నటించబోతున్న వినాయక్ భారీ ఫైట్లు,డాన్సులు ఏమీ చెయ్యడంట. ఈ చిత్రంలో మంచి ప్రాధాన్యత ఉండే పాత్రట.. ఇలాంటి క్యారెక్టర్ వినాయక్ లాంటి క్రేజ్ ఉన్న వ్యక్తి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దిల్ రాజు.. ఈ చిత్రంలో హీరోగా వినాయక్ ను ఎంచుకున్నాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus