టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా కొత్తవాళ్లకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్ వన్, నంబర్ టూ స్థానాలలో థమన్, దేవిశ్రీ ఉన్నారు. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు ఎక్కువగా వీళ్లకే అవకాశాలను ఇస్తున్నారు. అయితే ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రం అంచనాలను అందుకునే విషయంలో ఫెయిలవుతున్నారు. అందువల్ల హీరోలు, డైరెక్టర్లకు వేరేవాళ్లకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దేవర సినిమాకు ప్రస్తుతం అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. చాలాకాలం తర్వాత రెహమాన్ తెలుగులో మ్యూజిక్ అందిస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం. థమన్, దేవిశ్రీ ప్రసాద్ కొంతమంది డైరెక్టర్లకు బాగానే మ్యూజిక్ ఇస్తున్నా మిగిలిన వాళ్లకు న్యాయం చేయడం లేదు. నాని ఇప్పటికే ఒక్కో సినిమాకు ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ ను ట్రై చేస్తున్నారు.
ప్రభాస్ కూడా తన సినిమాలకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. దేవిశ్రీ, థమన్ లకు రాబోయే రోజుల్లో పూర్వ వైభవం వస్తుందేమో చూడాల్సి ఉంది. భవిష్యత్తు టాలీవుడ్ ప్రాజెక్ట్ లకు మ్యూజిక్ డైరెక్టర్లను ఎంపిక చేయడం దర్శకులు, హీరోలకు సవాల్ అవుతుతోంది. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నా అంచనాలను అందుకుంటున్న (Music Directors) మ్యూజిక్ డైరెక్టర్లు చాలా తక్కువమంది ఉన్నారు.
దేవిశ్రీ ప్రసాద్, థమన్ ఒక్కో సినిమాకు 3.5 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్లు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో ఫెయిలవుతున్నారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఒకటి రెండు సినిమాలతో మెప్పించినా వరుస విజయాలను అందుకోవడంలో ఫెయిలవుతూ తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమవుతున్నారు.
రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!
రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్!