టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో లైగర్ సినిమా ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా లైగర్ మూవీ నిలిచింది. ఈ సినిమా వల్ల నిర్మాతలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల నష్టాలు తప్పవని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ తను సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ ను వెనక్కిస్తే మాత్రమే నిర్మాతలకు నష్టాలు తగ్గే ఛాన్స్ అయితే ఉంది. అదే సమయంలో లైగర్ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో పాఠాలు నేర్పిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సరైన కథ లేకుండా పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తే అటు హీరోల కెరీర్ కు, ఇటు దర్శకుల కెరీర్ కు ఇబ్బందులు తప్పవని ఈ సినిమా ఫెయిల్యూర్ తో ప్రూవ్ అయింది. హిందీ ప్రేక్షకులను టార్గెట్ గా చేసుకుని టాలీవుడ్ డైరెక్టర్లు సినిమాలను తెరకెక్కించినా షాక్ తప్పదని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కథ, కథనం అద్భుతంగా ఉండటం ముఖ్యమని కథ,
కథనం ప్రేక్షకులను మెప్పించే విధంగా లేకపోయినా షాక్ తప్పదని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దర్శకుడు ఏ మాత్రం కథ విషయంలో వర్క్ చేయకుండా సినిమా తీస్తే ఆ సినిమా లైగర్ లా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లైగర్ సినిమాకు ముందు కూడా చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ యాక్టింగ్ తప్ప మరే పాజిటివ్ పాయింట్ లేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పూరీ జగన్నాథ్ లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ విలువైన సమయాన్ని వృథా చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి తనపై వ్యక్తమవుతున్న విమర్శలకు చెక్ పెట్టాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!