ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్
- December 30, 2021 / 02:16 PM ISTByFilmy Focus
ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట కలిగింది. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు అనుమతినిచ్చిన ప్రభుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ కృతజ్ఞతలు తెలిపింది. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ తరపున కొన్ని విన్నపాలు చేసుకోవడం జరిగింది.
అందులో మొదటగా థియేటర్స్ రీ ఒపెనింగ్ కి అనుమతి నిచ్చిన ఆంధ్రప్రధేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వై.ఎస్ జగన్‌మోహన్ రెడ్డిగారికి, సినిమాటోగ్రఫి మంత్రి వర్యులు శ్రీ పేర్ని నాని గారికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ తరపున కృతజ్ఞతలు. మిగతా విన్నపాల పట్ల కూడా సానుకూలంగా స్పందించి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాము అని తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేసింది.
శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!













