హీరోయిన్ లిప్పులకు లాకులేస్తున్న ఇస్మార్ట్ హీరో

దాదాపు 90ల కాలం వరకు తెరపై రొమాన్స్ అంటే డ్యాన్సులు మాత్రమే. హీరోయిన్ల అందచందాలు తెరపై ఎప్పటినుండో ఆరబోస్తున్నప్పటికీ.. రొమాన్స్ అంటే మాత్రం పువ్వులు, చెట్లు చూపించేవారు. “గీతాంజలి” సినిమాలో నాగార్జున ఇచ్చిన ఘాఢమైన అధర చుంభనం నుంచి తేరుకోవడానికే అర్ధ శతాబ్దం పట్టింది తెలుగు ప్రేక్షకులకు. అయితే.. మారుతున్న కాలంతోపాటు తెలుగు తెరపై రొమాన్స్, లిప్ లాక్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఇక “అర్జున్ రెడ్డి” సినిమా నుంచి లిప్ లాక్ అనేది సర్వసాధారణం అయిపోయిందనుకోండి.

అయితే.. టాలీవుడ్ లో ఇప్పటికీ చాలామంది హీరోహీరోయిన్లు ఆన్ స్క్రీన్ రొమాన్స్ కి “నో” అని గిరి గీసుకొని కూర్చున్నారు. విజయ్ దేవరకొండ మాత్రం ప్రతి సినిమాలో మినిమం రెండు మూడు లిప్ లాకులు లేకపోతే ఊరుకోవడం లేదు అది వేరే విషయం అనుకోండి. ఈ బాటలో రామ్ కూడా రెడీ అయిపోయాడు. క్లాస్ హీరోగా మంచి ఇమేజ్ ఉన్న రామ్ కి “ఇస్మార్ట్ శంకర్”తో భీభత్సమైన మాస్ ఇమేజ్ వచ్చింది. మాస్ యాంగిల్ తోపాటు తనలోని రొమాంటిక్ ఇమేజ్ ను కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు రామ్.

ఆల్రెడీ “జగడం” నుంచే ముద్దుల దండయాత్ర మొదలెట్టినప్పటికీ.. ఇప్పుడు ఇంకాస్త విస్తృతం చేసాడు. గత చిత్రం “ఇస్మార్ట్ శంకర్”లో నిధి అగర్వాల్ కు, ఇప్పుడు “రెడ్” సినిమాలో మాళవిక శర్మ లిప్స్ ను మాంచి గట్టిగా లాక్ చేసేసాడు రామ్. ఇవాళ విడుదలైన “నువ్వే నువ్వే” సాంగ్ ప్రోమోలో రామ్ లిప్ లాకే హైలైట్ గా నిలిచింది. సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రంపై రామ్ చాల కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.


2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus