Kaithi 2: కార్తి సినిమాకు టాలీవుడ్ నుంచి సర్‌ప్రైజ్ ఎంట్రీ?

తమిళంలో ఖైదీ సినిమాతో సంచలనం సృష్టించిన కార్తి, ఇప్పుడు దాని సీక్వెల్‌కు సిద్ధమవుతున్నారు. లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఖైదీ 2 ఇప్పటికే భారీ అంచనాల మధ్య ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. లోకేష్ ప్రస్తుతం రజినీకాంత్ (Rajinikanth) నటిస్తున్న కూలీ (Coolie) సినిమా పనుల్లో ఉన్నప్పటికీ, ఆ చిత్రానంతరం ఖైదీ 2 షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ పెద్ద ట్విస్ట్ కోసం ఇప్పటికే కోలీవుడ్ టాక్ మొదలైంది.

Kaithi 2

తాజా సమాచారం ప్రకారం, ఖైదీ 2 (Kaithi 2) లో టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందట. ఇప్పటివరకు ఆ పేరు బయటకు రాలేదు కానీ, ఖైదీ 2కు అది అదనపు ఆకర్షణగా నిలవనుందని ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ‘విక్రమ్’ (Vikram) సినిమాలో సూర్య (Suriya) రోల్ సినిమాకు ఎక్కడికో తీసుకెళ్లినట్టే, ఖైదీ 2లోనూ అలాంటి సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇదే ట్రాక్‌ను కొనసాగించేందుకు, లోకేష్ ఇప్పుడు తెలుగులోనూ తన మార్కెట్‌ను మరింత బలోపేతం చేయాలనుకుంటున్నాడు.

ఇటీవల ‘కూలీ’లో నాగార్జునను (Nagarjuna) తీసుకోవడం కూడా ఇదే వ్యూహంలో భాగమే. అలాగే ఖైదీ 2లో టాలీవుడ్ స్టార్ ఎంట్రీకి ఇది సరైన ప్లాట్‌ఫామ్ కావొచ్చని భావిస్తున్నారు. కార్తికి (Karthi) తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. డబ్బింగ్ సినిమాలే కాకుండా తెలుగు లోకల్ ప్రమోషన్స్‌కి కూడా అందుబాటులో ఉండే కార్తి, ఇక్కడ తన మార్కెట్‌ను బలోపేతం చేసుకోవడంలో ముందుంటారు. ఖైదీ సినిమాను సీక్వెల్‌గా మాత్రమే కాకుండా, మల్టీస్టారర్ యాంగిల్‌తో తీర్చిదిద్దే ప్రయత్నంలో లోకేష్ ఉన్నారని తెలుస్తోంది.

అంతేకాదు, కార్తి ఇటీవల నాని (Nani)  హీరోగా నటించిన హిట్ 3 (HIT 3) చివర్లో సర్‌ప్రైజ్‌గా కనిపించి అంచనాలను పెంచాడు. హిట్ 4 లో కీలక పాత్ర కోసం కార్తి పేరే వినిపిస్తున్న నేపథ్యంలో, ఖైదీ 2లో మరో స్టార్ తెలుగు హీరో ఎంట్రీకి ముహూర్తం వేయడమే అని చెప్పొచ్చు. ఇది టాలీవుడ్-కోలీవుడ్ మల్టీస్టారర్ ట్రెండ్‌ను కొనసాగించే సూచన కావొచ్చు. ఈ సినిమా ద్వారా లోకేష్ మరోసారి తన సినిమాటిక్ యూనివర్స్‌ను విస్తరించే అవకాశం ఉంది. ఖైదీ 2 కేవలం కార్తి సెంట్రిక్ యాక్షన్ డ్రామా మాత్రమే కాకుండా, మల్టీ లేయర్ న్యారేషన్‌తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంగా మారనుంది.

షూటింగ్లో గాయపడ్డ రాశీ ఖన్నా..ఫోటోలు వైరల్ !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus