హీరోల కెరీర్లో మచ్చగా మిగిలిన సినిమాలు

  • November 12, 2016 / 11:43 AM IST

సినిమాలన్నింటికీ నటులు, టెక్నీకల్ సిబ్బంది ఒకే విధంగా కష్టపడతారు. వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని ఫట్ అవుతాయి. అతి తక్కువ సంఖ్యలో మాత్రమే అత్యంత ఘోర పరాజయం అవుతాయి. అటువంటివి స్టార్ హీరోల సినిమాల జాబితాలో కూడా ఉన్నాయి. అవి వారి కెరీర్ లో ముల్లుగా గుచ్చుకుంటుంటాయి. అటువంటి వాటిపై ఫోకస్..

బిగ్ బాస్ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, అల్లుడా మజాకా వంటి హిట్లతో మంచి ఫామ్లో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని షాక్ కి గురిచేసిన చిత్రం బిగ్ బాస్. ఈ సినిమాని అభిమానులు కూడా పూర్తిగా చూడలేక పోయారు. ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్ వాటి చిత్రాలకు దర్శకత్వం వహించిన విజయ బాపినీడు తెరకెక్కించిన ఈ మూవీ ఏ కోణం లోను ఆకట్టుకోలేక పోయింది.

విజయేంద్ర వర్మనటసింహ బాలకృష్ణ చిత్రాల జాబితాల్లో ఆఖరి స్థానంలో కూడా నిలవదగని మూవీ విజయేంద్ర వర్మ. పేలవమైన స్క్రీన్ ప్లే, పాత కథతో స్వర్ణ సుబ్బారావు రూపొందించిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లో దిష్టి చుక్క లాంటిది.

భాయ్చిన్న దర్శకులకు అవకాశమిచ్చి వారిని బిగ్ స్టార్ చేయడంలో కింగ్ నాగార్జున రారాజు లాంటివారు. అటువంటి హీరో అంచనాలను తలకిందులు చేసిన సినిమా భాయ్. వీరభద్ర డైరక్షన్లో 2013 లో వచ్చిన ఈ సినిమాను ఇప్పటికే నాగ్ అభిమానులు చాలామంది మరిచిపోయారు.

షాడోవిక్టరీ వెంకటేష్ చిత్రాలకు మినిమమ్ గ్యారంటీ అనే పేరుంది. నిర్మాతలకు నష్టాలను మిగల్చదు అనే నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి బీటలు కలిగించిన సినిమా షాడో. ఈ సినిమా తెచ్చిన డిజాస్టర్ దర్శకుడు మెహర్ రమేష్ కి మెగాఫోన్ ని దూరం చేసింది.

కొమురం పులిఉపన్యాస సభకు వచ్చామా ? సినిమాకు వచ్చామా? అని ఆడియన్స్ కి అనుమానం కలిగించిన ఫిల్మ్ కొమురం పులి. ఇందులో పవన్ కళ్యాణ్ డైలాగులు ప్రసంగాన్ని గుర్తుకు తెస్తాయి. ఎస్.జ్ సూర్య దర్శకత్వంలో మరో ఖుషి లాంటి చిత్రం ఆశించిన ఫ్యాన్స్ కి కొమురం పులి నిరాశ మిగిల్చింది.

బ్రహ్మోత్సవంశ్రీమంతుడు మూవీతో తెలుగు చిత్రపరిశ్రమ టాప్ చైర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్న సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ క్రేజ్ తో థియేటర్లోకి వెళ్లిన అభిమానులకు ఈ చిత్రం చుక్కలు చూపించింది. ఈ కథను తమ హీరో ఎలా ఒప్పుకున్నాడు?.. డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఎలా తీసాడు ? అంటూ ఆవేశాన్ని తెప్పించిన సినిమా బ్రహ్మోత్సవం.

నరసింహుడుయంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తలవంచుకునేలా చేసిన సినిమా నరసింహుడు. ఎన్నో కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించిన బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏ వర్గాన్ని ఆకట్టుకోలేక పోయింది. దీంతో నిర్మాత చెంగల వెంకట్రావు హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందుకే తారక్ మూవీల జాబితాలో ఇప్పటికీ గుచ్చుకునే ముళ్లు నరసింహుడు.

వరుడుస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సూట్ కానీ కథ వరుడు. భారీ సెట్ల డైరక్టర్ గుణ శేఖర్ కి ఈమూవీ మరింత భారీ ఫ్లాప్ ని ఇచ్చింది. ఇందులో ఒక్క సీన్ కూడా బన్నీ అభిమానులను అలరించలేక పోయింది. దీంతో వారు వరుడు ని తమ మైండ్ లోంచి తీసేస్తున్నారు.

తుఫాన్ (జంజీర్)బిగ్ బి అమతాబ్ బచ్చన్ సినిమా, పోలీస్ పాత్ర… ఇంకేముంది జంజీర్ సినిమాతో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ బాలీవుడ్ లో స్థిరపడిపోతాడు అనుకున్నారందరూ. ఫలితం మాత్రం పూర్తిగా రివర్స్. తెలుగు వారు సైతం ఈ చిత్రం ఆడుతున్న థియేటర్ వైపు కూడా వెళ్లలేక పోయారు. దీంతో చెర్రీ అకౌంట్ లో ఒక ఘోర మైన ఫ్లాప్ పడింది.

చంటిమాస్ మహారాజ్ రవితేజకు చంటి అనే పేరు మంచి విజయాన్ని అందిస్తే, చంటి అనే సినిమా మంచి అపజయాన్ని ఇచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల కాలంలో నలిగిపోయిన కథతో స్వర్గీయ శోభన్ తీసిన ఈ చిత్రం రవితేజ కెరీర్లో బెస్ట్ ఫ్లాప్ మూవీ అనే పేరుని సొంతం చేసుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus