Samantha: స్టార్ హీరోయిన్ సమంత చెప్పుల ఖర్చు అన్ని వేలా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పదేళ్లకు పైగా కెరీర్ ను కొనసాగించి ఒకరిద్దరు మినహా అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించిన హీరోయిన్లలో సమంత ఒకరు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఖుషి సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఖుషి మూవీ రిలీజ్ కు మరో రెండున్నర నెలల సమయం ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సామ్ పాల్గొంటారా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

అయితే తాజాగా రిలీజైన ఆరాధ్య సాంగ్ లో సమంత మరింత అందంగా కనిపించారు. లుక్స్ విషయంలో సమంతకు మంచి మార్కులు పడుతుండగా ఆరాధ్య సాంగ్ లో సమంత ధరించిన చెప్పుల ఖరీదు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. సింపుల్ గా కనిపిస్తున్న ఈ చెప్పుల ధర 7,399 రూపాయలు కాగా ఫ్యాషన్ విషయంలో సమంతకు ఎవరూ సాటి రారంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

సమంత (Samantha) నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. సమంత కొంతకాలం పాటు యాక్టింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉండాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారని సమాచారం అందుతోంది.

ఖుషి సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమనులు కోరుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి అప్పట్లో సంచలనాలు సృష్టించగా ఈ సినిమా కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. ఖుషి సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అభిమానులను మెప్పించడం ఖాయమని తెలుస్తోంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus