వెండి తెరపై టాలీవుడ్ హిట్ పెయిర్స్

సినిమాలో హీరో, హీరోయిన్స్ నటన ముఖ్యం. ప్రేమకథ చిత్రాలైతే వారి మధ్య ప్రేమ పండాలి. నిజమైన ప్రేమికులుగా కనిపించాలి. అనిపించాలి. అప్పుడే ఆ మూవీ విజయవంతమవుతుంది. ఆ జంట హిట్ పెయిర్ గా పేరు దక్కించుకుంటుంది. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో వెండి తెరపై స్వీట్ లవర్స్ గా అలరించిన వారిపై ఫోకస్..

చిరంజీవి – రాధికచిరంజీవి, రాధికలు కలిసి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 18 సినిమాలో జంటగా నటించారు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు ’, ‘మొండి ఘటం ’, ‘అభిలాష ’ వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఈ జోడీ జాబితాలో ఉన్నాయి. అందుకే 80 వ దశకంలో చిరు, రాధికా పర్ఫెక్ట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు.

బాలకృష్ణ – విజయశాంతి బాలకృష్ణ, విజయశాంతి ను తెరపై చూస్తుంటే ఒకరికోసం ఒకరు పుట్టారా? అనిపిస్తుంటుంది. అందుకే అప్పట్లో వీరిద్దరికి సంభంధం ఉందని పత్రికలూ రాశాయి. అంతలా తెరపైన వీరి కెమిస్ట్రీ ఉండేది. అంతేకాదు
బాలయ్య, విజయ శాంతి నటించిన ‘లారీ డ్రైవర్ ’, ‘ముద్దుల మావయ్య ’, ‘రౌడీ ఇన్ స్పెక్టర్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. వారిద్దరూ కలిసి నటించిన సినిమాల సంఖ్య 17.

నాగార్జున- టబు మన్మధుడు నాగార్జునకు జోడీగా అందరూ హీరోయిన్లు బాగుంటారు. సౌందర్య, రమ్యకృష్ణతో నాగ్ రొమాన్స్ బాగుంటుంది. వారిద్దరి కన్నా నాగార్జునకు టబు నే సరిగ్గా సూటవుతుందని, వారిద్దరూ బెస్ట్ ఆన్ స్క్రీన్ కపుల్స్ అని నిన్నే పెళ్లాడుతా, ఆవిడే మా ఆవిడే చిత్రాలు నిరూపించాయి.

వెంకటేష్ – సౌందర్య తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా మహిళా ప్రేక్షకుల మనసు దోచుకున్న జంట వెంకటేష్, సౌందర్య. ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు మూవీతో విజయం అందుకున్న ఈ జోడీ రాజా, జయం మనదేరా వంటి ఆరు హిట్ చిత్రాల్లో అలరించింది.

పవన్ కళ్యాణ్ – భూమిక పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఎంతో మంది అందమైన హీరోయిన్స్ తో నటించారు కానీ.. ఒకే ఒక భూమిక మాత్రం పవన్ కి సరిజోడీగా తెలుగు ప్రేక్షకులు ముద్ర వేసేసారు. ఖుషీలో వీరిద్దరూ నిజమైన ప్రేమికులుగా నటించి మెప్పించారు. ఈ హిట్ కాంబినేషన్లో తర్వాత మూవీ రాకపోయినా ఒకే ఒక్క చిత్రం వీరిద్దరిని హిట్ పెయిర్ చేసింది.

మహేష్ బాబు – సమంత హిట్ పెయిర్ అంటే హైట్, వెయిట్ వంటి కొలతలు మ్యాచ్ కావడం కాదు… అదొక మ్యాజిక్. ఆ విషయాన్నీ మహేష్ బాబు, సమంత జంట స్పష్టంగా చూపించింది. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం ఈ జంట మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది.

ఎన్టీఆర్ – కాజల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన బాగా సెట్ అయిన హీరోయిన్ కాజల్. వీరిద్దరూ బృందావనం, బాద్ షా, టెంపర్ చిత్రాల్లో కలిసి నటించారు. పోటీ పోటీగా డ్యాన్సులు చేస్తూ రొమాంటిక్ సన్నివేశాల్లో నిజమైన ప్రేమికులుగా అదరగొట్టారు. హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు.

ప్రభాస్ – త్రిష సూపర్ లవ్ స్టోరీ మూవీ వర్షం. ఇందులో ప్రభాస్, త్రిష లు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత పౌర్ణమి, బుజ్జిగాడులోను ఆకట్టుకున్నారు. వీరిద్దరి హుషారు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది .

రామ్ చరణ్ – కాజల్ మగధీర సినిమాతో చరణ్, కాజల్ ది జన్మ జన్మల బంధంగా ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఆ విధంగా ఇద్దరూ జీవించారు. ఆ తర్వాత ‘నాయక్, ‘గోవిందుడు అందరివాడేలే ‘ అనే చిత్రాలతో హిట్ పెయిర్ అలరించింది.

నాగ చైతన్య – సమంత ఏ మాయ చేసావే మూవీతో జోడి కట్టిన నాగచైతన్య, సమంతలు ముచ్చటైన జంటగా ప్రశంసలు అందుకున్నారు. ఆటో నగర్ సూర్య, మనం మూవీలలో కలిసి నటించి కనువిందు చేశారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.

నితిన్, నిత్యామీనన్ యంగ్ హీరో నితిన్ కు లక్కీ హీరోయిన్ నిత్యామీనన్. అపజయాలతో కొట్టుకుపోతున్న నితిన్ ఇష్క్ మూవీ తో హిట్ ట్రాక్ లో వచ్చారు. ఇందులో వీరిద్దరూ క్యూట్ లవర్స్ గా మార్కులు కొట్టేశారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ జంట వెంటనే గుండెజారి గల్లంతయిందే అనే చిత్రం చేసి సక్సస్ ని సొంతం చేసుకుంది.

నిఖిల్, స్వాతి స్వామి రారా.. కార్తికేయ సినిమాలు థ్రిల్ ని కలిగిస్తాయి. డిఫరెంట్ కథ తో తెరకెక్కిన ఈ చిత్రాల్లో నిఖిల్, స్వాతి మధ్య లవ్ సీన్లు కొత్త ఫీల్ ని ఇస్తాయి. అందుకే వీరిద్దరూ కూడా హిట్ పెయిర్ గా క్రెడిట్ సొంతం చేసుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus