టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేళ్ల క్రితం వరకు ఇంగ్లీష్ టైటిల్స్ తో తెరకెక్కిన సినిమాలు అంచనాలకు మించి విజయం సాధించాయి. అయితే ఇప్పుడు మాత్రం ఇంగ్లీష్ టైటిల్స్ తో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అవుతుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇంగ్లీష్ టైటిల్ తో తెరకెక్కిన అమిగోస్ సినిమా ఫిబ్రవరి నెలలోని ఫ్లాప్ సినిమాలలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెడితే సినిమాలు ఆడటం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
సుధీర్ బాబు నటించిన హంట్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ది వారియర్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.
లైగర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. టాప్ గేర్, 7 డేస్ 6 నైట్స్, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇంగ్లీష్ టైటిల్స్ తో తెరకెక్కిన సినిమాలలో కొన్ని సినిమాలు హిట్టైనా మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఇకపై తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.
దర్శకనిర్మాతలు ఈ కామెంట్లను పరిగణనలోకి తీసుకుంటారో లేదో చూడాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు క్రేజ్ పెరుగుతుండగా ఆ సినిమాలకు అయినా తెలుగు టైటిల్స్ కు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పవచ్చు.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!