టాలీవుడ్ సినిమా బిజినెస్.. వేరే లెవెల్!

  • March 1, 2021 / 08:03 PM IST

లాక్ డౌన్ అనంతరం సినిమా బిజినెస్ పుంజుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ నిర్మాతలు కోట్ చేస్తున్న రేట్లు ఆకాశానంటుతున్నాయి. కొరటాల శివ-చిరంజీవి కాంబోలో వస్తోన్న ‘ఆచార్య’ సినిమాకి నైజాం రూ.40 కోట్ల వరకు కోట్ చేసి అమ్మారు. అదే సినిమా ఆంధ్రా హక్కులు ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ రూ.50 నుండి రూ.60 కోట్ల మధ్యలో ఉంటుందని టాక్. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఆంధ్ర ఏరియాకు నలభై కోట్లకు పైగా రేటు చెబుతున్నారు నిర్మాత దిల్ రాజు.

అలానే సుకుమార్ ‘పుష్ప’ సినిమా ఆంధ్ర ఏరియా రూ.45 కోట్ల రేషియాలో ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక బోయపాటి-బాలకృష్ణ సినిమా ఇప్పటికే ఆంధ్రలో రూ.35 కోట్ల బిజినెస్ చేసింది. బాలయ్య సినిమాల్లో ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. యంగ్ హీరో నాగచైతన్య-సాయిపల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ఆంధ్రలో రూ.15 కోట్లకు అమ్మారు. ఈ బజ్ ఉన్న సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా అదే రేంజ్ లో కోట్ చేస్తున్నారు నిర్మాతలు.

నాగ్ అశ్విన్ నిర్మించిన ‘జాతిరత్నాలు’ సినిమా ఆంధ్ర ఏరియా రూ.8 కోట్ల రేషియాలో అడుగుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ‘కేజీఎఫ్2’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ సినిమాల రేట్లు వేరే లెవెల్ లో ఉన్నాయి. కరోనా టెన్షన్ జనాల్లో తగ్గడంతో థియేటర్ కి వచ్చి సినిమాలు చూస్తున్నారని.. సినిమాలు ఏవరేజ్ గా ఉన్న కలెక్షన్స్ బాగా వస్తున్నాయని నిర్మాతలు భావిస్తున్నారు. అందువలనే సినిమాకి ఎక్కువ రేట్ కోట్ చేయడంలో తప్పు లేదంటూ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus