Tollywood: ఫస్ట్ డే ఆ మూవీ ఎంత వసూలు చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!

2023లో టాలీవుడ్‌లో పలు చిత్రాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్స్‌గా నిలిచాయి. కొన్ని సినిమాలు హైప్ కారణంగా మొదటి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టాయి. ఈ నేపథ్యంలో 2023 విడుదలైన చిత్రాల్లో ఆదిపురుష్,బ్రో, వీరసింహారెడ్డి సహా ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు ఎంటో చూద్దాం..

1) ఆదిపురుష్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 32.84 కోట్ల షేర్ రాబట్టి 2023లో అత్యధిక ఫస్ట్ డే వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది.

2) ‘వీరసింహారెడ్డి’ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా తొలి రోజు రూ. 25.35 కోట్ల షేర్ రాబట్టి 2వ ప్లేస్‌లో నిలిచింది.

3) బ్రో : పవన్ కళ్యాాణ్ లీడ్ రోల్లో సాయి ధరమ్ తేజ్ మరో ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘బ్రో’. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 23.61 కోట్ల షేర్‌తో మూడో స్థానంలో నిలిచింది.

4) వాల్తేరు వీరయ్య చిరంజీవి, రవితేజ హీరోలుగా శృతి హాసన్ కథానాయికగా నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 22.90 కోట్ల షేర్ రాబట్టింది.

5)  ‘దసరా’ నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా ‘దసరా’. ఈ సినిమా తొలి రోజు రూ. 14.22 కోట్ల వసూళ్లను సాధించింది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus