బుల్లితెరలో ఎప్పటికి బోర్ కొట్టని కథాంశం అత్తాకోడళ్ల గొడవ. కోడలిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా? అని ఆలోచించే అత్త.. ఆమె ఎత్తులకు పై ఎత్తులు వేసే కోడలు.. ఇటువంటి కథని ఎన్ని ఎపిసోడ్స్ తీసినా చూస్తూనే ఉంటారు. ఇక వెండితెర విషయానికి వస్తే.. అత్త కోడళ్ల కాంబినేషన్ కంటే.. అత్త అల్లుడు పోటీ మరింత మజాగా ఉంటుంది. అత్తని ఎదిరించి అల్లుడు గెలిస్తే.. ఆ సినిమా విజయం సాధించినట్టే. అలా ఇప్పటివరకు తెలుగులో విజయం సాధించిన అత్త, అల్లుళ్ల కథా చిత్రాలపై ఫోకస్..
1. గుండమ్మ కథ (ఎన్టీఆర్, ఏఎన్నార్)
2. రౌడీ అల్లుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, అల్లుడా మజాకా (చిరంజీవి)
3. అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు (నాగార్జున)
4. అనసూయమ్మ గారి అల్లుడు, నారి నారి నడుమ మురారి (బాలకృష్ణ)
5. నా అల్లుడు (ఎన్టీఆర్)
6. బొబ్బిలి రాజా ( వెంకటేష్)
7. అత్తారింటికి దారేది (పవన్ కళ్యాణ్)
8. శైలజా రెడ్డి అల్లుడు (నాగ చైతన్య- ఇంకా రిలీజ్ కాలేదు)
మీరు మెచ్చిన.. మేము వదిలేసినా మంచి అత్త అల్లుళ్ళ కథ చిత్రాలంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.