టాలీవుడ్ నంబర్ వన్ స్టార్ హీరో బాహుబలే.. ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలకు గుడ్ బై చెప్పిన తర్వాత నుంచి ఇప్పటివరకు టాలీవుడ్ లో నంబర్ వన్ ఎవరనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. వరుసగా విజయాలను సొంతం చేసుకోవడంలో చాలామంది హీరోలు తడబడటంతో నంబర్ వన్ హీరో ఎవరనే చర్చకు సంబంధించి విభిన్నమైన సమాధానాలు వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఓరమ్యాక్స్ సర్వే ఫలితాలు తాజాగా వెల్లడి కాగా మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ జాబితాలో ప్రభాస్ నంబర్ వన్ స్థానంలో నిలవగా

జూనియర్ ఎన్టీఆర్, చరణ్, బన్నీ 2, 3, 4 స్థానాలలో ఉన్నారు. ఈ జాబితాలో మహేష్ ఐదో స్థానంలో నిలిస్తే పవన్ ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. చిరంజీవి, నాని, రవితేజ, విజయ్ దేవరకొండ 7, 8, 9, 10 స్థానాలలో నిలిచారు. ఈ సర్వే ఫలితాలు జెన్యూన్ గా ఉంటాయని చాలామంది భావిస్తారు. ఆర్మాక్స్ మీడియా ఫలితాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలే ఈ జాబితాలో మంచి స్థానాలలో నిలుస్తున్నారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ నంబర్ వన్ స్టార్ హీరో బాహుబలే అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ప్రభాస్ మార్కెట్ ఊహించని రేంజ్ లో పెరుగుతోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ ఈ ఏడాది జూన్ లో ఆదిపురుష్ మూవీతో సెకండాఫ్ లో సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ రెండు సినిమాలు ప్రభాస్ ఇమేజ్ ను రెట్టింపు చేయడంతో పాటు బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలతో ప్రభాస్ కోరుకున్న విజయాలు దక్కుతాయో లేదో చూడాల్సి ఉంది. ఇతర భాషల ప్రేక్షకులు సైతం ప్రభాస్ నటనకు ఫిదా అవుతున్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus