క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వరుణ్ సందేశ్, షగ్న శ్రీ జంటగా, హీరోయిన్ షగ్న శ్రీ దర్శకత్వంలో ఎస్ 2ఎస్ సినిమాస్ ప్రొడక్షన్ నెం.2 మూవీ పోస్టర్ రిలీజ్
వరుణ్ సందేశ్ హీరోగా ఎస్ 2ఎస్ సినిమాస్ ఈ రోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రాన్ని అనౌన్స్ చేసింది. శ్సాస్ ప్రొడక్షన్స్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న షగ్న శ్రీ వేణున్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మంచి పేరున్న ఆర్టిస్టులు చాలా మంది నటిస్తున్నారు.
ఈ రోజు రిలీజ్ చేసిన మూవీ పోస్టర్ లో ఒక బ్లాక్ డ్రెస్ ధరించిన యువ జంట చేతిలో రోజా పూలతో ఉండటం, మరో యువకుడు ఈ జంటలోని యువతి చేయి పట్టుకుని కనిపిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.
నటీనటులు – వరుణ్ సందేశ్, షగ్న శ్రీ , తదితరులు
టెక్నికల్ టీమ్
—————————–
కాస్ట్యూమ్ డిజైనర్ – దర్శిత్
కొరియోగ్రాఫర్ – శ్రావణ్ ముప్పిరి
డీవోపీ – బ్రహ్మతేజ మరిపుడి
మ్యూజిక్ – వంశీకాంత్ రేఖన
ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్
ప్రొడ్యూసర్స్ – వీఎస్ కే సంజీవ్, వంగలపల్లి సందీప్, వంగలపల్లి సంకీర్త్
డైరెక్షన్ – షగ్న శ్రీ వేణున్