ప్రముఖ దర్శకుడు కన్నుమూత!

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్‌తో ‘యమగోల’ లాంటి అద్భుతమైన సినిమా తీసిన ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తాతినేని రామారావు ఈ రోజు వేకువజామున చెన్నైలో తుది శ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గత కొన్ని రోజులుగా ఆయన వైద్యం పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లోకాన్ని విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.

Click Here To Watch NOW

తాతినేని రామారావు మరణవార్తతో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. గొప్ప దర్శకుడిని కోల్పోవడం బాధాకరం అంటూ సినీ తారలు, అభిమానులు, ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా సందేశాలు పెడుతున్నారు. రామారావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ప్రముఖ నిర్మాత నారాయణదాస్‌ నారంగ్‌ మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. వెంటవెంటనే ఇద్దరు ప్రముఖుల్ని కోల్పోవడం పెద్ద విషాదమే అని చెప్పాలి. తాతినేరి రామారావు కృష్ణా జిల్లా, కపిలేశ్వరపురంలో 1938లో జన్మించారు. లెజెండరీ దర్శకుడు తాతినేని ప్రకాశ్‌రావుకు రామారావు సమీప బంధువు.

చిన్నతనం నుండి ప్రకాశ్‌రావును చూస్తూ పెరిగిన రామారావుకు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలనే ఆశ కలిగిందట. ప్రకాశ్‌రావు వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చాలా సంవత్సరాలపాటు పనిచేశారు రామారావు. కొన్ని రోజుల తర్వాత నాగేశ్వరరావు, సావిత్రి కాంబినేషన్‌లో ‘నవరాత్రి’ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ సినిమా విజయంతో అప్పటి స్టార్‌ హీరోలతో రామారావుతో వరుస సినిమాలు చేశారు. ‘బ్రహ్మచారి’, ‘మంచి మిత్రులు’, ‘జీవన తరంగాలు’, ‘దొరబాబు’, ‘యమగోల’, ‘అనురాగ దేవత’, ‘పచ్చని కాపురం’ వంటి చిత్రాలు రామారావు నుండి వచ్చినవే.

ఎన్టీఆర్‌ ‘యమగోల’ తాతినేని రామారావుకు మంచి గుర్తింపు తెచ్చిందని చెప్పొచ్చు. ఆ సినిమాను 1979లో హిందీలోకి ‘లోక్‌ పర్‌లోక్‌’ పేరుతో రీమేక్‌ చేసి బాలీవుడ్‌లోనూ మొదటి ప్రయత్నంలోనే హిట్‌ అందుకున్నారు తాతినేని రామారావు. 1980 నుంచి వరుసగా హిందీ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. తాతినేని రామారావు మొత్తంగా 70 సినిమాలకు దర్శకత్వం వహించారని సమాచారం. తెలుగులో కంటే హిందీ సినిమాలే ఎక్కువగా చేయడం గమనార్హం. బాలీవుడ్‌లోకి వెళ్లాక దాదాపు రీమేక్‌ చిత్రాలే చేశారు. ఆయన దర్శకుడిగా వహించిన చిత్రాల్లో సగం రీమేక్‌లే ఉన్నాయి. తమిళంలో హిట్‌ అయిన సినిమాలను హిందీలో చేసి హిట్‌ కొట్టారు తాతినేని రామారావు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus