రెమ్యూనరేషన్ పెంచేసినట్టు ఓపెన్ గా చెప్పేసిన హీరోయిన్..!

సాధారణంగా వరుసగా హిట్లు వస్తుంటే.. హీరో అయినా.. హీరోయినయినా రెమ్యూనరేషన్ పెంచేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఓపెన్ గా ఒప్పుకోరు. ఇప్పటి వరకూ అలా ఏ సెలబ్రిటీ డైరెక్ట్ స్పందించలేదు. అది ప్రేక్షకులు కూడా అర్ధం చేసుకుంటారు తప్ప పెద్దగా కామెంట్ చేయరు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఓ హీరోయిన్ డైరెక్ట్ గా రెమ్యూనరేషన్ పెంచేసినట్టు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు తాప్సి. కెరీర్ ప్రారంభంలో తెలుగు సినిమాల్లో నటించిన తాప్సి…ఇక్కడ పెద్దగా హిట్లు లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసింది. అక్కడ కూడా సక్సెస్ కాకపోతే బాలీవుడ్ కు చెక్కేసింది.

అక్కడ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ.. హిట్లు మీద హిట్లందుకుంటుంది తాప్సి. దీంతో రెమ్యూనరేషన్ పెరిగే ఉంటుంది అని అంతా అనుకుంటారు. విలేకరులు రెమ్యూనరేషన్ గురించి తాప్సిని అడిగిన ప్రశ్నకి తాప్సి బదులిస్తూ… ” నేను రెమ్యూనరేషన్ పెంచిన మాట నిజమే. గత రెండేళ్ళలో నా రెమ్యూనరేషన్ అమాంతం పెరిగింది. అయితే అది డిమాండ్ చేసి పుచ్చుకుంటున్నది కాదు.. నిర్మాతలే ఇష్టపూర్వకంగా నా ప్రతిభకు తగ్గట్లు పారితోషకం ఇస్తున్నారు. మేల్ ఆర్టిస్ట్ లతో పోలిస్తే నేను తీసుకుంటున్న పారితోషకం తక్కువే…! నాకిస్తున్న పారితోషకం పట్ల దర్శక నిర్మాతలు కూడా సంతోషంగానే ఉన్నారు. బాగా డబ్బులు సంపాదించేయాలన్న కోరిక నాకు లేదు.. అలాగే నా పారితోషకం వల్ల సినిమా ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం నేను ఎప్పుడూ రానివ్వను. గతంలో నాకు అవకాశం దక్కుతుందా అని ఎదరు చూస్తూ వేరే వాళ్ళ దయ మీద ఆధారపడేదాన్ని.. కానీ ఇప్పుడు మంచి మంచి సినిమాలు నన్నే వెతుక్కుని వస్తున్నాయి” అంటూ చెప్పుకొచ్చింది తాప్సి.

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus