Varun, Lavanya: ఆ హీరోయిన్ వరుణ్ తేజ్ పెళ్ళికి హాజరు కాకపోవడానికి కారణం అదేనా..?

రీసెంట్ గా వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీ లో ఎంత ఘనంగా జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ పెళ్ళికి ఇండస్ట్రీ కి సంబంధించిన వారిలో కేవలం నితిన్ ఒక్కడే హాజరు అయ్యాడు. మిగిలిన వారు ఎవ్వరూ కూడా హాజరు అవ్వలేదు. వరుణ్ తేజ్ అయితే ప్రత్యేకించి కొంతమంది సెలబ్రిటీస్ ని పిలిచాడు. వారిలో ప్రముఖ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఒకరు. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి రాశీ ఖన్నా ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు.

రాశీ ఖన్నా కచ్చితంగా వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఆమె మాత్రం రాలేదు. ఇందుకు వరుణ్ తేజ్ బాగా హర్ట్ అయ్యినట్టు తెలుస్తుంది. రాశీ ఖన్నా వరుణ్ తేజ్ కి మంచి స్నేహితురాలు. ఆయన ఇండస్ట్రీ లో స్నేహం చేసిన తోటి నటీనటుల లిస్ట్ చాలా తక్కువ ఉంటుంది, అందులో రాశీ ఖన్నా కూడా ఒకరు. అలాంటిది ఆమెకి ఇంత విలువ ఇచ్చి పిలిచినా రాకపోవడం వరుణ్ తేజ్ కి బాగా బాధని కలిగించిందట.

పోనీ షూటింగ్స్ లో బిజీ గా ఉండడం వల్ల రాశీ ఖన్నా పెళ్ళికి హాజరు కాలేకపోయిందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఈమె చాలా రోజుల నుండి షూటింగ్స్ కి దూరంగా ఉంది. కొత్త ప్రాజెక్ట్స్ పై సంతకం చేసింది కానీ, అవి వచ్చే ఏడాది వరకు ప్రారంభం కావు. ఖాళీ గా ఉన్నా కూడా పెళ్ళికి హాజరు కాలేదు అంటే ఆమె కావాలనే ఈ దూరంగా ఉన్నిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న రూమర్ ఏమిటంటే రాశీ ఖన్నా వరుణ్ తేజ్ మరియు లావణ్య పెళ్లిని చూడడం ఇష్టం లేకనే రాలేదని అంటున్నారు.

ఎందుకంటే గతం లో రాశీ ఖన్నా (Varun) వరుణ్ తేజ్ తో ప్రేమాయణం నడిపింది అని, కానీ కొన్ని కారణాల వల్ల బ్రేకప్ జరిగిందని, అందుకే నేరుగా వాళ్ళిద్దరి పెళ్లి చూసి తట్టుకునే శక్తి లేకనే ఆమె ఈ పెళ్ళికి దూరం గా ఉందని అంటున్నారు. వీటిలో ఏది నిజం , ఏది అబద్దమో పక్కనా పెడితే రాశీ ఖన్నా పెళ్ళికి దూరంగా ఉండడం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus