ఇదెక్కడి అన్యాయమయ్య కొరటాల అంటున్న ఫ్యాన్

ఇటీవల కాలంలో సినిమా కథలో కంటెంట్ ఉంటే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ కూడా ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. ఒకప్పుడు తమ అందచందాలతో ఇండస్ట్రీని ఏలిన అందాల ముద్దుగుమ్మలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక.. అత్త, అమ్మ పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియమణి అలా సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. అయితే ఇటీవల రిలీజ్ అయిన జవాన్ సినిమాలో ప్రియమణి ఏ రేంజ్‎లో నటించిందో తెలిసిందే. తాజాగా దర్శకుడు కొరటాల..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో నటిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్‎కి జతగా ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య బుల్లి తెర పై తెగ సందడి చేసింది. వెబ్ సిరీస్‎లు కూడా చేసి అందరిని అలరించింది. ఒకానొక సమయంలో జాతీయ అవార్డు ను సైతం సొంతం చేసుకున్న ప్రియమణి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.

ఈ క్రమంలోనే ప్రియమణి… దేవర సినిమాలో ఎన్టీఆర్ కి అమ్మ పాత్రలో కనిపించబోతుందట. అయితే ఎన్టీఆర్ చిన్నప్పటి రోల్లో ఉండే అమ్మ పాత్రలో ప్రియమణి కనిపిస్తుందట. దీంతో సోషల్ మీడియాలో ఇదే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. కొంతమంది ప్రియమణి అభిమానులు కత్తిలాంటి ఫిగర్ ని అమ్మ పాత్రలకు ఎలా సెట్ చేశావయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus