స్టార్ హీరోయిన్ తీరుపై మండిపడ్డ నిర్మాతలు!

సినిమా ఇండస్ట్రీలో షూటింగ్ లు చేసే సమయంలో చిన్న చిన్న గొడవలు జరగడం కామన్. సినీనటులు సెట్లో తమకి అవమానం జరిగిందనో.. వారికి సరైన ఏర్పాట్లు చేయడం లేదనో షూటింగ్ నుండి వెళ్లిపోవడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే సెట్లో తన కుక్కకి అవమానం జరిగిందని షూటింగ్ నుండి వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్ ఒకరున్నారు. ఆ సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్నేళ్లక్రితం సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన ‘గూఢచారి 116’ సినిమా అప్పట్లో పెద్ద హిట్టు.

జేమ్స్ బాండ్ తరహాలో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. నిర్మాత డూండీ.. కృష్ణను హీరోగా తీసుకొని ఈ సినిమాను నిర్మించారు. తమిళంలో అప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జయలలితను హీరోయిన్ గా తీసుకున్నారు. జయలలితకి కుక్కలంటే చాలా ఇష్టం. తన పెంపుడు కుక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. అప్పుడప్పుడు సినిమా సెట్స్ కి వాటిని తీసుకొస్తుంటుంది. ఈ క్రమంలో ‘గూఢచారి 116’ సినిమా షూటింగ్ కి కూడా తనతో పాటు పెంపుడు కుక్కని తీసుకెళ్లిందట.

సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తవుతున్న సమయంలో సెట్ లో తన కుక్కకి అవమానం జరిగిందట. దీంతో ఆమె అలిగి షూటింగ్ మధ్యలో నుండి వెళ్లిపోయారట. దీంతో దర్శకనిర్మాతలు ఆమె ప్రవర్తనపై మండిపడ్డారట. కృష్ణతో జయలలితకు మిగిలి ఉన్న షాట్లను, కొన్ని క్లోజప్ సన్నివేశాలను ముందుగానే తీసుకొని.. జయలలిత ఇచ్చిన కాల్షీట్ల కంటే ముందుగానే ఆమెని పంపించేశారట.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus