సినిమా ఇండస్ట్రీ లో హీరోల డామినేట్ కాస్త ఎక్కువగా నడుస్తోంది. కానీ ఇంత డామినేషన్‌లోనూ కొందరు దర్శకులు బ్రాండ్ చూపిస్తున్నారు. టాలీవుడ్‌లో హీరోల రేంజ్ మాత్రమే కాదు దర్శకుల రేంజ్ కూడా మారిపోయింది. అందుకే వాళ్లు కూడా గ్యాప్ తీసుకుని వస్తున్నారు. హీరోలు ఎలాగైతే ఒక్కో సినిమా కోసం రెండేళ్లు తీసుకుంటున్నారో.. డైరెక్టర్స్ అదే రూట్ ఫాలో అవుతున్నారు. అలా 2023లో కొరటాల, రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులు కనిపించడం లేదు.. వాళ్ల నుంచి ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రావట్లేదు.
ఆచార్య దెబ్బ తర్వాత కొరటాలకు కోలుకోడానికే ఆరు నెలలు పైగా పట్టింది. కొత్త సినిమా పట్టాలెక్కించడానికి మరో ఆరునెలలు పోయింది. అలా ఏడాది పాటు ఖాళీగానే ఉన్నారు కొరటాల శివ. ప్రస్తుతం ఈయన జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. దీంతో హిట్ కొట్టాలని కసి మీదున్నారు ఈ దర్శకుడు. 2024 ఎప్రిల్ 5న దేవర విడుదల కానుంది.
అలాగే మరోవైపు పుష్ప సినిమా కోసం ఐదేళ్లు రాసిచ్చేసారు సుకుమార్. 2018 మార్చ్‌లో రంగస్థలం విడుదలైతే.. 2019, 2020లో సినిమాలేవీ చేయలేదు సుకుమార్. 2021 డిసెంబర్‌లో పుష్పతో వచ్చిన ఈయన.. 2022తో పాటు 23ను కూడా వదిలేస్తున్నారు. 2024 సమ్మర్‌లోనే పుష్ప 2 విడుదల కానుంది. ఈ మధ్యే నేషనల్ అవార్డ్ రావడంతో.. పార్ట్ 2పై మరింత ఫోకస్ చేస్తున్నారు లెక్కల మాస్టారు.
ఇక రాజమౌళి అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత మరో సినిమానే మొదలుపెట్టలేదు. మహేష్ బాబుతో సినిమాకు కమిటైనా.. అది మొదలవ్వడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉంది. 2024లోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ లెక్కన జక్కన్న నెక్ట్స్ సినిమా 2025లో వచ్చే ఛాన్స్ ఉంది.
ఇక త్రివిక్రమ్ సైతం మూడేళ్లుగా సినిమా చేయలేదు. 2020 అల వైకుంఠపురములో తర్వాత 2021, 2022, 2023 గ్యాప్ తీసుకున్నారు. 2024 సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చేస్తున్నారు. మొత్తానికి ఈ అగ్ర దర్శకులంతా భారీ గ్యాప్‌లకు అలవాటు పడిపోయారు. మరి 2024లో అయిన వస్తారా లేదా 2025 వరకు వెయిట్ చేయిస్తారా అనేది చూడాలి.
జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!