సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు. నిత్యం ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు.సినీ పరిశ్రమకు చెందిన ఎవరొకరు అనారోగ్య సమస్యలతో లేదా వయసు సంబంధిత సమస్యలతో లేదా గుండెపోటుతో మరణిస్తూనే ఉన్నారు. ఈ మధ్యనే శరత్ బాబు, కన్నడ నటుడు నితిన్ గోపి, దర్శకుడు వెట్రిమారన్ అసిస్టెంట్ శరన్ రాజ్, మంగళ్ ధిల్లాన్ ,కొరియన్ నటి పార్క్ సూ రియాన్ , రాకేష్ మాస్టర్,మలయాళం సీనియర్ నటుడు పూజపుర రవి(83) వంటి వారు మరణించడం జరిగింది.
తాజాగా మరో సినీ సెలబ్రిటీ మరణించడం అందరికీ షాకిచ్చింది. వివరాల్లోకి ప్రముఖ సీనియర్ ఎడిటర్ పి. వెంకటేశ్వర రావు మరణించారు. ఈయన వయసు 72 ఏళ్లు. వయసు సంబంధిత సమస్యలతోనే ఈయన మరణించినట్లు తెలుస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోని ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఈయన ఎడిటర్ గా పని చేశారు. ‘మొండి మొగుడు పెంకి పెళ్ళాం’ ‘యుగంధర్’,’ముద్దాయి’ , ‘కెప్టెన్ కృష్ణ’, ‘ఇద్దరు అసాధ్యులు’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి ఈయన ఎడిటర్ గా పని చేయడం జరిగింది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 200కు పైగా సినిమాలకు ఈయన పనిచేశారు. దర్శకుడు కె ఎస్ ఆర్ దాస్ కి వెంకటేశ్వర రావు మేనల్లుడు అవుతారు. పి. వాసు వంటి నిన్నటి తరం స్టార్ డైరెక్టర్ల సినిమాలకు ఈయన పనిచేశారు. ఇక వెంకటేశ్వర రావు మృతికి టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం నాడు అనగా 22 వ తేదీన ఈయన దహన సంస్కారాలు నిర్వహించబోతున్నట్లు సమాచారం.