టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న టైంలోనే .. బాలీవుడ్ పై ఉన్న మోజుతో అక్కడికి చెక్కేసింది గోవా బ్యూటీ ఇలియానా. కానీ ఈమె అక్కడ మాత్రం సక్సెస్ కాలేదు. ఏదో చిన్నా చితకా.. సినిమాలు చేస్తూ కాలక్షేపం చేస్తూ వచ్చింది. పోనీ అలా అయినా ముందుకు సాగిందా అంటే..మధ్యలో ఓ విదేశీయుడితో ప్రేమలో పడింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది కూడా.! ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించేసింది కాబట్టి.. ఇక వీరి పెళ్లి మాత్రమే తరువాయి అని అంతా అనుకున్నారు.
కానీ వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో విడిపోయారు. ఈ క్రమంలో ఇలియానా డిప్రెషన్ కు లోనయ్యింది. చాలా లావు అయిపోయింది కూడా..! ఇలాంటి పరిస్థితుల్లో ఇలియానాకు అవకాశాలు కూడా రాలేదు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో అవకాశం వచ్చినా .. అది డిజాస్టర్ అయ్యింది. కొంచెం గ్యాప్ తీసుకుని ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టి.. ఇలియానా సన్నబడింది.ఇప్పుడు మళ్ళీ సౌత్ లో అడుగుపెట్టాలని చూస్తుంది. ఈ క్రమంలో ‘అందాదున్’ రీమేక్ లో అవకాశం వచ్చినా ఇలియానా రిజెక్ట్ చేసిందని వినికిడి.
అయితే నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ఈమె బంపర్ ఆఫర్ కొట్టేసిందనే అనే చెప్పాలి.
Most Recommended Video
పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?