Prabhas: రాధేశ్యామ్ కథ రాసిన దర్శకుడు ఎవరో తెలుసా!

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కావడానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రేమకు విధికి మధ్య జరిగే యుద్ధంగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ అడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ సినిమాకు జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకుడు అనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు కథ రాసింది మాత్రం ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన చంద్రశేఖర్ ఏలేటి కావడం గమనార్హం.

చంద్రశేఖర్ ఏలేటి పామిస్ట్రీ ఆధారంగా ఈ సినిమా కథను తయారు చేశారని ఆయన ఈ కథను ప్రముఖ హీరోలలో ఒకరైన వెంకటేష్ కు చెప్పగా వెంకటేష్ ఈ కథలో నటించడానికి అంగీకరించలేదని బోగట్టా. సెకండాఫ్ స్క్రిప్ట్ ఆశించిన విధంగా లేకపోవడంతో వెంకటేష్ నో చెప్పారని తెలుస్తోంది. ఆ తర్వాత చంద్రశేఖర్ ఏలేటి కథను అమ్మేశారని సమాచారం. మొదట ఈ కథలో లవ్ స్టోరీ లేదని పామిస్ట్రీకి పాటు లవ్ స్టోరీని చేర్చి రాధాకృష్ణ కుమార్ ప్రభాస్ కు ఈ సినిమా కథ చెప్పి ఓకే చేయించుకున్నారని సమాచారం.

బాహుబలి2 సినిమా విడుదలకు ముందే ప్రభాస్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకీ స్థానంలో ప్రభాస్ చేరడంతో పాటు దర్శకుడు మారడంతో ఈ సినిమా స్క్రిప్ట్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద రాధేశ్యామ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. సినిమా సినిమాకు ప్రభాస్ కు క్రేజ్ పెరుగుతుండగా ఈ సినిమాతో ప్రభాస్ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ఈ సినిమాలో నటించారు. రాధేశ్యామ్ సినిమా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus