Shivamani: పాపం ఆ హీరోకు అలాంటి ఛాన్స్ మళ్ళీ రాదేమో!

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కుదిరితే చాలా బాగుంటుందని అనుకుంటూ ఉంటాము. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి విక్టరీ వెంకటేష్ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్. సరైన కటౌట్ తో యాక్షన్ హీరో లాగ ఉండే వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కి పూరి జగన్నాథ్ మార్క్ యాటిట్యూడ్ హీరోయిజం తోడు అయితే, మూవీ లవర్స్ కి పండగే. అభిమానులు మరియు ప్రేక్షకులు కూడా ఈ కాంబినేషన్ కోసం చాలా ఎదురు చూసారు కానీ, ఇప్పటి వరకు వీళ్లిద్దరి కలయిక లో ఒక్క సినిమా కూడా రాలేదు.

అయితే అప్పట్లో వీళ్ళ కలయిక ఒక సినిమా చెయ్యాలని చర్చలు మాత్రం నడిచాయట. కానీ వెంకటేష్ కి సెకండ్ హాఫ్ పెద్దగా నచ్చకపోవడం తో ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడు. ఆ సినిమా మరేదో కాదు, అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘శివమణి’ అనే చిత్రం. ఈ సినిమాని తొలుత వెంకటేష్ తోనే చెయ్యాలని కథని రాసుకున్నది పూరి జగన్నాథ్, వెంకటేష్ కి ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, కానీ సెకండ్ హాఫ్ ఎందుకో ఆయన ఆ స్క్రీన్ ప్లే కి కనెక్ట్ అవ్వడం లేదు.

ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సినిమాలాగా, సెకండ్ హాఫ్ మొత్తం మరో సినిమాలాగా అనిపిస్తుందని చెప్పాడట వెంకటేష్. అయితే కథలో మార్పులు చేసేందుకు స్కోప్ లేకపోవం తో వెంకటేష్ ఈ కథకి నో చెప్పాడట. ఆ తర్వాత ఇదే కథని కొన్నాళ్ళకు పూరి జగన్నాథ్ అక్కినేని నాగార్జున ని కలిసి, ఇదే కథని వినిపించాడట. ఆయనకీ తెగ నచ్చేసింది. వెంటనే షూటింగ్ మొదలు పెట్టారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదలైన (Shivamani) ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అయితే అయ్యింది కానీ, పెద్ద రేంజ్ కి వెళ్ళలేదు. వెంకటేష్ చెప్పినట్టుగానే సినిమా విడుదలైన తర్వాత అందరూ సెకండ్ హాఫ్ గురించే నెగటివ్ గా మాట్లాడుకున్నారు.అప్పట్లోనే ఈ సినిమా 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది, కానీ సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ రేంజ్ లో ఉండుంటే, ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యేదని ట్రేడ్ పండితులు చెప్పే మాట.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus