Namratha: నమ్రత శారీ పిక్స్ వెనుక అంత కథ ఉందా?

  • October 17, 2023 / 10:43 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ అందరికీ సుపరిచితమే. ఘట్టమనేని వారి చిన్న కోడలిగా ఓ పక్క ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క పిల్లల ఆలనా పాలనా చూసుకుంటుంది. అంతేకాకుండా మహేష్ బాబు యాడ్స్ కి సంబంధించిన వ్యవహారాలు అలాగే అతని సినిమా ప్రమోషన్ల వ్యవహారాలు వంటివి కూడా నమ్రత హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు మహేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా వెనకుండి నడిపించేది నమ్రతనే అని ఎక్కువ మందికి తెలిసుండదు.

ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. సినిమా వేడుక అయినా ఫ్యామిలీ ఫంక్షన్ అయినా.. మహేష్ తో పాటు నమ్రత కూడా హాజరవుతూ ఉంటుంది. ఈ జంటకు టాలీవుడ్లో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల మహేష్ బాబు ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి హాజరయ్యాడు. అతనితో పాటు నమ్రత కూడా హాజరైంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలకి ఓ స్పెషాలిటీ ఉంది.

అదేంటి అంటే.. ఈసారి (Namratha) నమ్రత ఓ డిజైనర్ శారీలో దర్శనమివ్వడం. ఆమె ఎక్కువగా చుడీదార్ వంటివే ధరిస్తూ ఉంటుంది. అయితే ఈసారి శారీలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదిలా ఉండగా.. నమ్రత ధరించిన శారీని ఓ టాలీవుడ్ హీరో భార్య డిజైన్ చేసిందట. ఆమె మరెవరో కాదు మంచు విష్ణు భార్య విరానికా రెడ్డి. ఈ విషయాన్ని తెలుపుతూ నమ్రత తన పోస్ట్ లో ఆమెకి థాంక్స్ చెబుతూ కామెంట్ కూడా పెట్టింది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus