వయనాడ్ విరాళం విషయంలో ఈ టాలీవుడ్ స్టార్ హీరోలను మెచ్చుకోవాల్సిందే!

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన భీభత్సం అంతాఇంతా కాదు. కొండ చరియలు విరిగిపడటం వల్ల వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ ఘటన దేశంలోని ప్రజలను ఎంతగానో కలిచివేసింది. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు స్పందించి తమ వంతు సహాయం చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన రష్మిక (Rashmika) 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఏకంగా 25 లక్షల విరాళం ప్రకటించడం గమనార్హం.

మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi)  , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఏకంగా కోటి రూపాయల విరాళం ప్రకటించడం ద్వారా మంచి మంచి మనస్సును చాటుకుని ప్రశంసలు అందుకున్నారు. చిరంజీవి, చరణ్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మెగా హీరోలు తమ వంతు సహాయం చేసిన నేపథ్యంలో మిగతా టాలీవుడ్ హీరోలు సైతం వేగంగా స్పందించి తమ వంతు విరాళం ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సూర్య  (Suriya)  దంపతులు, కార్తీ (Karthi) 50 లక్షల రూపాయలు విరాళం అందించారు. నయన్ (Nayanthara) విఘ్నేష్ (Vignesh Shivan) దంపతులు 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించడం గమనార్హం. మమ్ముట్టి (Mammootty) , దుల్కర్ సల్మాన్  (Dulquer Salmaan) కలిసి 35 లక్షల రూపాయల విరాళం ప్రకటించగా ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil) 25 లక్షల రూపాయలు, కమల్ హాసన్ (Kamal Haasan) 25 లక్షల రూపాయలు, విక్రమ్ (Chiyaan Vikram)  20 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు.

మోహన్ లాల్ (Mohanlal) స్వయంగా సహాయక చర్యలలో పాల్గొనడంతో పాటు విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా బాధితుల కోసం 3 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించడం గమనార్హం. వయనాడ్ బాధితుల కోసం విరాళం అందించిన టాలీవుడ్ సెలబ్రిటీలను, ఇతర సెలబ్రిటీలను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus