అబ్బో స్కెచ్ బానే ఉంది.. నిర్మాతలు చూస్తూ ఊరుకుంటారా?

ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా సినీ ఇండస్ట్రీ పై పెద్ద దెబ్బె పడింది.ఇప్పుడు షూటింగ్ లు నిలిచిపోయాయి. డైలీ సీరియల్స్ షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్ లకు అలాగే నిర్మాతలకు పెద్ద ఎత్తున నష్టాలు వాటిల్లే అవకాశం ఉంటుంది. థియేటర్ల మైంటైనెన్స్ కు ఎలాగూ అందులో పనిచేసేవారికి జీతాలు ఇవ్వాల్సిందే. ఇదిలా ఉంటే.. సడన్ గా హీరోలు కొందరు సీక్రెట్ గా వీడియో కాన్ఫరెన్స్ కాల్ లో పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కొందరు స్టార్ హీరోలు మీడియం హీరోలు ఈ వీడియో కాల్ లో పాల్గొన్నారని తెలుస్తుంది. ఇంత సడన్ గా వీరు మీటింగ్ లో పాల్గొనడం వెనుక కారణం ఏంటా అని ఆరాతీస్తే… వీరంతా ఏకమై ఓ ప్రొడ్యూసర్ గిల్డ్ ను స్థాపించాలి అని ప్లాన్ చేసారట. ఇప్పుడున్న పరిస్ధితుల్లో థియేటర్ లు ఓపెన్ అయ్యే పరిస్ధితి లేదు. అందరూ ఇంట్లోనే ఉన్నారు. కాబట్టి నిర్మాణ రంగంలో ఉన్న టెక్నిక్స్ ను తెలుసుకుని… ఇండస్ట్రీ పై పట్టు సాధించాలి అనేది వీరి ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది.

థియేట్రికల్ రైట్స్ పరంగా ఇప్పుడు కలిసొచ్చేది ఏమీ లేదు.నాన్ థియేట్రికల్ పరంగా వచ్చే దాని పైనే… ముఖ్యంగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ పై ఎంత రాబట్టుకోవచ్చు అనే విషయాల్ని తెలుసుకుని సొంతంగా సినిమాలను నిర్మించడం అలాగే పంపిణీలు చేయడం వంటివి చేయాలి అని అందుకు కొంతమంది నమ్మకంగా ఉండేవారిని పెట్టుకోవాలి అని వీరు భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి నిర్మాతలు ఇవ్వన్నీ చూస్తూ ఊరుకుంటారా అనేది పెద్ద ప్రశ్న..!

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus