ప్రముఖ సినీ గేయ రచయిచ కందికొండ యాదగిరి(49) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. కందికొండ అకాల మరణంతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలం క్రితం క్యాన్సర్ వ్యాధితో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఖర్చులు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందిపడ్డారు. ఆ సమయంలో తోటి గీత రచయితలతో పాటు రాష్ట్ర మంత్రి కేటీఆర్..
కందికొండ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కందికొండ యాదగిరి 1973 అక్టోబర్ 13న వరంగల్ జిల్లా నాగుర్లపల్లిలో జన్మించారు. తెలంగాణ జానపదాలు పాడుకుంటూ, పాటలపై మక్కువ పెంచుకున్నారు కందికొండ. ఆ ఇంట్రెస్ట్ తోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. తెలంగాణ ప్రాంతం నుంచే వచ్చిన సంగీత దర్శకుడు చక్రితో కందికొండ చదువుకొనే రోజుల్లోనే పరిచయం ఉండేది. ఆ పరిచయంతోనే చక్రి.. కందికొండను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘ఇడియట్’, ‘సత్యం’ ఇలా ఎన్నో సినిమాల్లో పాటలు రాశారు కందికొండ.
వందలాది పాటలను పలికించిన కందికొండ తెలుగు చిత్రసీమ పాటల పర్వంలో తనకంటూ ఓ స్థానం సంపాదించారు. ఆయన చివరిగా ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమాలో రెండు పాటలు రాశారు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!