ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో బిగ్బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తూ జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సోలో బాయ్. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి, భద్రం, షఫీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. త్రిలోక్ సుద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. అయితే ఎంతో ప్రేక్షక ఆదరణతో ముందుకు వెళుతున్న సందర్భంగా ఈ చిత్ర బృందం సోలో బాయ్ చిత్రాన్ని ఆదర్శించినందుకుగాను ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థాంక్యూ మీట్ పెట్టడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రముఖ లిరిసిస్ట్ పూర్ణాచారి మాట్లాడుతూ… “నాకు ఈ సినిమాలోని పాటను రచించే అవకాశం ఇచ్చినందుకుగాను ముందుగా చిత్ర బృందానికి చాలా థాంక్స్. అలాగే మా చిత్రాన్ని థియేటర్లలో ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నాను” అన్నారు.

నటి అనిత చౌదరి మాట్లాడుతూ… “ముందుగా మా సినిమాకు సపోర్ట్ చేసినందుకు మీడియా వారికి థాంక్స్. నాకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా థ్యాంక్స్. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సోలో బాయ్ సినిమా చూసిన వారంతా ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి నాతో వ్యక్తిగతంగా షేర్ చేసుకున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నందుకుగాను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అన్నారు.

నటి శ్వేత అవస్తి మాట్లాడుతూ… “మీడియా వారికి థాంక్స్. మీడియా తరఫునుండి వచ్చిన ప్రశంసలకు మేము ఎంతో ఆనందిస్తున్నాము. మమ్మల్ని, మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా థ్యాంక్స్” అన్నారు.

దర్శకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ… “మా సోలో బాయ్ చిత్రాన్ని సోల్ ఫుల్ గా హిట్ చేసినందుకు అందరికీ నా కృతజ్ఞతలు. మంచి కంటెంట్ ఉన్న సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తే ఎంతగా ఆదరిస్తారో మరోసారి నిరూపించారు. సినిమాలో గౌతమ్ కృష్ణ ఎంతో బాగా నటించారు. నటన మాత్రమే కాకుండా డాన్స్ ఇంకా ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుని తనదైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అనిత చౌదరి గారు, పోసాని కృష్ణ మురళి గారు అద్భుతంగా నటించారు. హీహీరోయిన్ శ్వేత అవస్తి ఎన్నో వేరియేషన్స్ తో ఉన్న తన క్యారెక్టర్ తో చక్కగా నటించారు. ఆమె భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్తారు. ఈ సినిమాలో ఉన్న ఐదు పాటలు ఐదు ఆణిముత్యాలు లాంటివి. సంగీత దర్శకుడు జూడ సాండీ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. యాక్షన్ సీన్స్ కూడా బాగా వచ్చాయి. ఈ సినిమాకు నిర్మాతగా ముందుకు వచ్చిన సతీష్ గారికి ముందు ముందు మరింత లాభాలు వచ్చి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సోలో బాయ్ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమాను అందరూ థియేటర్లో చూసి మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర డైరెక్షన్ టీం మాట్లాడుతూ… “మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులు అందరికీ మా కృతజ్ఞతలు. ఈ సినిమాను థియేటర్లలో చూసి మరింత ఆదరిస్తారని కోరుకుంటున్నాము” అన్నారు.

నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ… “సోలో బాయ్ సినిమా చూసి మీడియా వారి దగ్గర నుండి ప్రతి ఒక్కరూ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మౌత్ టాక్ ద్వారా సినిమాను ముందుకు తీసుకువెళ్తున్నారు. దానికిగాను అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా మొదలైన రెండు సంవత్సరాల తర్వాత అదే తేదీన థాంక్యూ మీట్ జరగడం అనేది యాదృచ్ఛికమని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పని చేశాము. ఎన్ని అవదుడుకులు వచ్చినా కూడా తట్టుకుని నిలబడి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాము. దానికి సహాయపడుతూ నాతో తోడుగా నిలబడిన అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా మాకు ఎన్నో విషయాలు నేర్పించింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాతో ఉన్నాయని నమ్ముతున్నాను. మా బ్యానర్ గౌరవం తగ్గే సినిమా నేను చేయను. భవిష్యత్తులో కూడా మంచి సినిమాలు మాత్రమే చేస్తాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. చిత్ర బంధం అంతా ఈ సినిమాకు ఎంతో సహకారాన్ని అందించారు. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చినందుకు సంతోషంగా ఉంది” అన్నారు.

నటుడు గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ… “నిన్న సినిమా చూసిన ఒక పెద్దావిడ ఒక మంచి సినిమా చూసా అని చెప్పిన వీడియో చూసాక నేను చాలా సంతోషించాను. ఒక మంచి సినిమా చూశాను అనే ఫీల్ తో ప్రేక్షకులు బయటకు వస్తుంటే అది తెలిసి నాకు ఎంతో ఎమోషనల్ గా అనిపించింది. అందరం కలిసికట్టుగా పనిచేసి మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాము. చాలా చిన్నగా చేద్దాం అనుకున్న సినిమా కానీ మంచి కంటెంట్ ఉండటంతో పెరుగుతూనే వెళ్ళింది. మీడియా వారు, ప్రేక్షకులు సోలో బాయ్ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు సినిమాను ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్లడం అనేది సంతోషకరంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కంటెంట్ హీరో. మరొకసారి మా సినిమాను ఆదరించిన అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అంటూ ముగించారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus