Chiranjeevi: చిరుకి దూరం కావడానికి కారణమదే!

  • November 11, 2021 / 09:18 AM IST

టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కోటి.. చాలా మంది అగ్ర హీరోల సినిమాల కోసం పని చేశారు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు బ్లాక్ బస్టర్ సాంగ్స్ అందించారు. మెగాస్టార్ చిరంజీవి.. కోటితో కలిసి చాలా సినిమాలకు పని చేశారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘పదహారేళ్ల వయసు, ‘అందమా అందుమా’, ‘ప్రియా రాగాలే’ వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో చిరు-కోటిల మధ్య మంచి అనుబంధం ఉండేది.

అయితే ఓ సంఘటన కారణంగా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోటి.. మెగాస్టార్ తో గ్యాప్ ఎందుకు వచ్చిందో వెల్లడించారు. ఓ సినిమా వంద రోజుల ఫంక్షన్ ఒంగోలులో జరిగిందని.. అది తన అత్తగారి ఊరు కావడంతో ఒకరోజు ముందుగానే వెళ్లినట్లు చెప్పారు కోటి. అయితే సడెన్ గా తన హైఫీవర్ రావడంతో ఫంక్షన్ కి రాలేకపోయారట. కానీ తను కావాలనే ఫంక్షన్ కి రాలేదని కొందరు చిరంజీవికి ఉన్నవి, లేనివి చెప్పారట.

ఆ తరువాత చిరుకి అసలు విషయం చెప్పడానికి ఆఫీస్ కు వెళ్తే.. అప్పుడు ఆయన మాట్లాడే మూడ్ లో లేనని చెప్పారని కోటి అన్నారు. చిరంజీవి అలా రియాక్ట్ కావడంలో తప్పు లేదనిపించిందని.. దీంతో వెనక్కి వచ్చేశానని వెల్లడించారు కోటి. ‘హిట్లర్’తరువాత మళ్లీ చిరంజీవితో కలిసి పని చేయలేదని వివరించారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus