ఆ కేసులో నిర్మాత కేపీ చౌదరిని అరెస్ట్ చేసిన సైబారాబాద్ పోలీసులు!

మాదక ద్రవ్యాల విక్రయం కేసులో ‘కబాలి’ చిత్ర తెలుగు నిర్మాత కృష్ణ ప్రసాద్‌ చౌదరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు బుధవారం ఉదయం వెల్లడించిన సైబరాబాద్‌ పోలీసులు.. అరెస్ట్‌ చేసినట్లు తాజాగా ప్రకటించారు. నిందితుడు కొకైన్‌ విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. కేపీ చౌదరి నుంచి 82.75 గ్రాముల కొకైన్, కారు, రూ.2.05 లక్షల నగదు, 4 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కృష్ణ ప్రసాద్‌ చౌదరిది ఖమ్మం జిల్లా బోనకల్‌. బీటెక్‌ చదివి పలు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసిన ఆయన..

2016 నుంచి సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమా తెలుగు వర్షన్‌కు నిర్మాతగా వ్యవహరించారు. కృష్ణప్రసాద్‌ చౌదరి పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గానూ పనిచేశారు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, అర్జున్‌ సురవరం తదితర సినిమాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. అనుకున్నంతగా లాభాలు రాకపోవడంతో కేపీ చౌదరి డ్రగ్స్‌ సరఫరాలోకి దిగారు. గోవాలో ఓహెచ్‌ఎం పబ్‌ను (producer) ఆయన ప్రారంభించారు.

హైదరాబాద్‌ నుంచి గోవా వచ్చే స్నేహితులు, సెలెబ్రిటీలకు డ్రగ్స్‌ సరఫరా చేశారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో తిరిగి హైదరాబాద్‌ వచ్చారు. గోవా నుంచి వచ్చే ముందు నైజీరియన్‌ పెటిట్‌ యేజుబర్‌ నుంచి 100 ప్యాకెట్ల కొకైన్‌ను తీసుకొచ్చారు. వాటిలో కొన్నింటిని వినియోగించిన కేపీ చౌదరి.. మిగిలిన వాటిని కిస్మత్‌పూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus