Nidhhi Agerwal: ఆ ఒక్క పూజ నిధి జీవితాన్నే మార్చేసిందిగా!

ఇండియా లో ఇప్పుడు ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా , ఎంత పెద్ద నిర్మాత అయినా ప్రభాస్ కాల్ షీట్స్ కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు. కేవలం ప్రభాస్ ని నమ్మి వేల కోట్ల రూపాయిలు బిజినెస్ టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది. బాహుబలి సిరీస్ తర్వాత ఆయనకీ వచ్చిన క్రేజ్ అలాంటిది. ఆ సిరీస్ తర్వాత ఆయన మూడు సినిమాలను విడుదల చేస్తే, ఆ మూడు చిత్రాలు కూడా ఒక దానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి.

అయినా కూడా ఆయన ఇమేజి ఇసుమంత కూడా తగ్గలేదు. ఆయన కాల్ షీట్స్ కోసం ఇప్పటికీ కొంత మంది పాన్ ఇండియన్ డైరెక్టర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఒక్క హీరోయిన్ కాల్ షీట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమె మరెవరో కాదు, యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నిధి అగర్వాల్. ఈమె ప్రస్తుతం ప్రభాస్ – మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగిపోయింది. కారణం నిధి అగర్వాల్ డేట్స్ కోసమేనట.

ఆమెతో పాటు ఈ చిత్రం లో పని చేసే మిగిలిన ఆర్టిస్టుల డేట్స్ సమస్య కూడా రావడం తో ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. నిన్న మొన్నటి వరకు వరుస ఫ్లాప్స్ తో కెరీర్ పరంగా అవకాశాలు లేక డీలా పడిన నిధి అగర్వాల్ , ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియన్ లెవెల్ లో సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న హీరో కూడా ఎదురు చూసే రేంజ్ కి వెళ్ళింది. సడన్ గా నిధి అగర్వాల్ గ్రాఫ్ ఇలా పెరగడానికి కారణం, వేణు గోపాల స్వామి ద్వారా దోష నివారణ పూజ చేయించుకోవడం వల్లే.

అందం , క్రేజ్ ఉన్నపటికీ కూడా కెరీర్ ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లడం లేదని ఆమె వేణు గోపాల స్వామి తో పూజలు చేయించుకుంది. అప్పటి నుండి ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు . ప్రభాస్ తో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఆమె ‘హరి హర వీరమల్లు’ లాంటి ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ని చేస్తుంది. 60 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగిలిన భాగం త్వరలోనే పూర్తి చేసుకోనుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే నిధి అగర్వాల్ దశ మారినట్టే, చూడాలి మరి.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus